పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన వేడుక. అందుకే యువత.. తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అలా యువత.. తమ అభిరుచికి తగిన వారిని ఎంచుకుని వివాహ వేడుకను ఘనంగా చేసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు ఆగి పోతున్నాయి. కొద్ది క్షణాల్లో ఒకటి కాబోయే జంటలు కూడా చిన్న చిన్న గొడవలతో విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు వధువులు అబ్బాయికి బట్టతలని, పొట్టివాడని, లావులేడని.. ఇలా అనేక కారణాలతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే పెళ్లి మండపం మీదకు వచ్చిన తరువాత అలాంటి కారణలతో వివాహాన్ని రద్దు చేసుకుంటున్నారు. తాజాగా ఓ వధువుకు కూడా అలాంటి పనే చేసింది. మరికొద్ది నిమిషాల్లో పెళ్లనగా..వరుడి ముక్కు చిన్నగా ఉందని..తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని బాంబు పేల్చింది. వధువు తీసుకున్న నిర్ణయానికి పెళ్లికి వచ్చిన అతిథులు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ లోని సంబాల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడి, సమీపంలోని పట్టణానికి చెందిన యువతితో ఇటీవలే నిశ్చితార్ధమైంది. ఈ క్రమంలో బుధవారం వారి వివాహం జరగనుంది. ఈక్రమంలో వరుడి కుటుంబ వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్లింది. పెళ్లి వారి రాక అమ్మాయి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన వారిలో కొంతమంది మహిళలు వరుడి ముక్కు చాలా చిన్నాగా ఉందంటూ మాట్లాడుకున్నారు. వారి మాటలు విన్న వధువు..వరుడిని చూసేందుకు వెళ్లింది. అతడితో మాట్లాడాలనే వంకతో వరుడిని కలిసింది. మహిళలు మాట్లాకున్నట్లే ముక్కు చిన్నగా ఉందని వధువు గ్రహించింది. పెళ్లికి ముందే ఇలా ఎగతాళి చేస్తే..పెళ్లి తరువాత ఇంకా ఎక్కువగా హేళన చేస్తారని అమ్మాయి భావించింది. దీంతో యువతి వెంటనే పెళ్లికి నిరాకరించింది. అబ్బాయి ముక్కు చాలా చిన్నగా ఉందని కాబట్టి అతడిని వివాహం చేసుకోనని తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది.
అయితే కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్దలు ఆ యువతిని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా సదరు యువతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కొద్ది సమయం పాటు వధువు కుటుంబ సభ్యులతో వరుడు బంధువులు వాగ్వాదానికి దిగారు. తాము ఏమి చేయలేమని అమ్మాయి బంధువులు చేతులెత్తేశారు. దీంతో చేసేదేంలేక వరుడు కుటుంబ సభ్యులు వచ్చిన దారిని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే ఇలాంటి కేసులు ఎప్పుడు తమ దృష్టికి రాలేదని అస్మోలీ పోలీసులు తెలిపారు. పెళ్లికి ముందే అన్ని చూసుకోకుండా..పెళ్లి సమయంలో ఇలా చేయడం దారుణం అంటూ ఈ వార్త తెలిసిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.