భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు. కమల్ హాసన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి దూరం కానున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇండియాలోనే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌ని తెలుగులో ‘స్టార్ మా’ నిర్వహిస్తోంది. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా 14 సీజన్స్ చేసాడు. తెలుగు, తమిళంలో 5వ సీజన్‌కి రంగం సిద్దం అవుతోంది. తెలుగులో మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్.టి.ఆర్., రెండవ సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించగా, మూడవ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు.5వ సీజన్‌కి ఇక్కడ నాగార్జున హోస్ట్ అంటున్నారు.
తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. అయితే 5 సీజన్స్కే షో నిర్వాహకులతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఈ 5వ సీజన్ తర్వాత కమల్ బిగ్ బాస్‌కి గుడ్‌బై చెప్పబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇటు కమల్ నుంచి గానీ, అటూ షో నిర్వాహకుల నుంచి రాలేదు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో. ప్రస్తుతం కమల్ లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమా చేస్తున్నారు.