రోడ్డు ప్రమాదంలో ఓ ప్రాణం పోవడం అంటే.. ఓ కుటుంబం రోడ్డున పడటమే అనే సినిమా డైలాగ్ అందరికీ తెలుసు. అతి వేగం ప్రమాదకరం మరియు ప్రాణాంతకం అని అందరికీ తెలుసు. వేగంగా వెళ్లడం వల్ల మనకే కాదు.. మన నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం పోయే అవకాశం ఉంది అని కూడా బాగా తెలుసు. కానీ, కొందరు మాత్రం స్పీడ్ వల్ల వచ్చే క్షణికానందం కోసం వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడం, అవతలి వాళ్ల ప్రాణాలను ప్రమాదంలోకి తోయడం చేస్తున్నారు. అంత స్పీడ్ ఎందుకు నెమ్మదిగా వెళ్లమని చెప్పిన పాపానికి ఓ వ్యక్తి.. బైకర్ ప్రాణం తీయబోయాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీలోని అర్జంఘర్ మెట్రో స్టేషన్ సమీపంలో అనూజ్ చౌదరి అనే వ్యక్తి తనకే కారు ఉన్నట్లు రోడ్డుపై హల్ చల్ చేశాడు. వేగంగా రోడ్డుపై ఇష్టారీతిన డ్రైవ్ చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ బైకర్ల గ్రూప్ సభ్యుడు శ్రేయాన్ష్ అనూజ్ కి నెమ్మదిగా వెళ్లాల్సిందిగా చెప్పాడు. అందుకు ఆగ్రహంతో ఊగిపోయిన అనూజ్ చౌదరి శ్రేయాన్ష్ పై బూతులతో రెచ్చిపోయాడు. వారి అంతు చూస్తానని.. కారుతో తొక్కించి చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడు.
#WATCH | A man hit a biker with his four-wheeler following a heated verbal exchange with the biker group, near Arjan Garh metro station in Delhi. (05.06)
Police say they’ve taken cognisance of the matter & investigation is on.
(Note: Abusive language)
(Source: Biker’s friend) pic.twitter.com/ZHXdGil95z
— ANI (@ANI) June 6, 2022
ఆ తర్వాత శ్రేయాన్ష్ తన బైక్ వెళ్తుండగా వెనక నుంచి అత్యంత వేగంగా వెళ్తూ.. కారును రైట్ కట్ చేసి శ్రేయాన్ష్ ను ఢీకొట్టాడు. ఒక్కసారిగా బైక్ కంట్రోల్ తప్పిపోయి శ్రేయాన్ష్ రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో శ్రేయాన్ష్ కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇదంతా శ్రేయాన్ష్ స్నేహితుడి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ట్వీట్టర్ లో పోస్ట్ చేస్తూ.. పీఎంవో, ఢిల్లీ సీఎం, డీసీపీని ట్యాగ్ చేశారు.
Delhi Police have apprehended the accused driver who hit a biker with his four-wheeler following a heated verbal exchange with the biker group, near Arjan Garh metro station in Delhi yesterday pic.twitter.com/b81ka86aHE
— ANI (@ANI) June 6, 2022
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కారు నడిపిన లా విద్యార్థి అనూజ్ చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై స్పందించిన బాధితుడు శ్రేయాన్ష్.. ‘నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఆరావళిలోని దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న అనూజ్ చౌదరితో వాగ్వాదం జరిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Delhi | The 26-year-old accused driver has been arrested and the car has been seized. An Attempt to murder case has been registered in the matter: M Harsha Vardhan, ADCP South on biker hit by car driver after verbal spat pic.twitter.com/5gZRtH431P
— ANI (@ANI) June 6, 2022