హెల్మెట్ పెట్టుకోకపోతే మాకేటి? అనేది బూతు మాట. టూవీలర్ నడిపేటప్పుడు తలకి హెల్మెట్ పెట్టుకోవాలి కదండీ. అది పెట్టుకోరా? పెట్టుకోకుండా రోడ్డెక్కడం ఏమిటండి? ఎందుకండీ ఇలాంటి వాళ్ళు. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ట్రాఫిక్ పోలీస్ ఫైనేస్తే హర్ట్ ఐపోతారు. ఏ వాహనమో గుద్దితే హాస్పిటల్ లో పోయి పడతారు. చూడండి సార్ అక్కడ ఏమైందో.
రోడ్డు ప్రమాదంలో ఓ ప్రాణం పోవడం అంటే.. ఓ కుటుంబం రోడ్డున పడటమే అనే సినిమా డైలాగ్ అందరికీ తెలుసు. అతి వేగం ప్రమాదకరం మరియు ప్రాణాంతకం అని అందరికీ తెలుసు. వేగంగా వెళ్లడం వల్ల మనకే కాదు.. మన నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం పోయే అవకాశం ఉంది అని కూడా బాగా తెలుసు. కానీ, కొందరు మాత్రం స్పీడ్ వల్ల వచ్చే క్షణికానందం కోసం వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడం, అవతలి వాళ్ల ప్రాణాలను […]
డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఏటా వందల మంది బలవుతున్నా.. జనాల్లో మార్పు రావడం లేదు. అతి వేగంగా వాహనాలు నడుపుతూ.. అమాయకులు పాలిట యమకింకరులు అవుతున్నారు. వీరిలో సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ర్యాష్ డ్రైవింగ్ కేసులో టాలీవుడ్ హీరో దాసరి అరుణ్ అరెస్ట్ అయ్యాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసులో హీరో దాసరి అరుణ్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సయ్యద్ […]
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా విపరీతమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొంత మంది నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. మరోవైపు ఆకతాయిల అల్లరికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉంటే చాలు.. తామే హీరోలం అన్నట్టు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై బైక్ లతో స్టంట్లు చేస్తూ వాహనదారులకు దడ పుట్టిస్తున్నారు. దుర్గగుడి […]