ఢీల్లీ మెట్రో ట్రైన్ లో ఇటీవల ప్రయాణికులు చేస్తున్న పిచ్చి చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ రీల్, ముద్దూ ముచ్చట్లు.. కొట్టుకోవడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా రద్దీగా ఉండే బస్సు ప్రయాణాల్లో ఉద్యోగస్థులు, విద్యార్థులు, మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.. కానీ మెట్రో సేవలు వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడంలో తిరుగులేని నమ్మకాన్ని సోంతం చేసుకుంటున్నాయి మేట్రో రైళ్లు. అయితే ఎంత సౌకర్యం ఉన్నా అందులో ప్రయాణికులు చేసే వెకిలి చేష్టలు, సీట్ల కోసం కొట్టుకోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు యువకులు మెట్రోలో తన్నుకున్నారు. ఈ గటన ఢిల్లీ మెట్రో రైల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఢిల్లీ మెట్రోలో పలు అసభ్యకర ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. పబ్లిక్ ఏమనుకుంటారో అన్న విచక్షణ లేకుండా ప్రేమజంటలు ముద్దులు పెట్టుకోవడం, డ్యాన్స్ రీల్స్ , బ్రేష్ వేసుకొని రావడం, స్నానం చేయడం వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. ఇక ప్రయాణం అన్న తర్వాత ఎక్కడైనా సీట్ల కోసం గొడవలు జరగడం సహజం, ఇందుకు మెట్రో రైలు మినహాయింపు కాదు. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంబంధించిన మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తుంది. రద్దీగా ఉన్న రైల్లో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
మెట్రోలో అప్పటికే ప్రయాణికుల తాకిడితో అసలు నిల్చోవడానికే చోటు లేని పరిస్థితిలో ఇద్దరు యువకులు గొడవ పెట్టుకోవడం.. ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకున్నారు. ఇతరు ప్రయాణికులు వారిని ఎంతగా వారించినా వారు ఊరుకోకుండా మరింత రెచ్చిపోయి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అయితే.. వీరి మధ్య అసలు గొడవ ఎందుకు వచ్చిందో తెలియరాలేదు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఢిల్లీ మెట్రోలో జనాలు ఇక మారరు.. ఇలాంటి సంఘటనలు షరా మామూలే అంటున్నారు.
A fight broke out between two people on @OfficialDMRC Violet Line. #viral #viralvideo #delhi #delhimetro pic.twitter.com/FbTGlEu7cn
— Sachin Bharadwaj (@sbgreen17) June 28, 2023