ఢిల్లీ మెట్రో పాడు పనులకు అడ్డగా మారింది. అవును, మీరు విన్నది నిజమే. గత కొంత కాలం నుంచి మెట్రోలో తమకు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే మరో యువతి ప్రవర్తించింది. మెట్రోలో ప్రయాణికుల ముందే అలా చేసి అందరికీ షాకిచ్చింది అసలేం జరిగిందంటే?
గత కొన్ని రోజులు నుంచి కొందరు యువతి, యువకులు మెట్రోలో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారు. ప్రయాణికుల ముందే బహిరంగంగా తన ప్రియురాలిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఢిల్లీ మెట్రో రైలులో ఎక్కువగా చాలా వెలుగు చూస్తున్నాయి. గతంలో ఇలాంటి ఎన్నో జరిగాయి. అయితే, ఈ వరుస ఘటనలు మరువకముందే తాజాగా మరో యువతి మెట్రోలో ఎవరూ ఊహించని పనికి శ్రీకారం చుట్టింది. ఇదంతా కొందరు ప్రయాణికులు గమనించి సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుని అదే వీడియోను సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇంతకు ఆ యువతి ఏం చేసిందో తెలుసా?
ఢిల్లీ మెట్రోలో ఓ యువతి ఎవరూ ఊహించని పని చేసింది. మెట్రోలో ప్రయాణిస్తూనే తన జుట్టును స్ట్రెయిట్ చేసుకుంది. ఆమె చేసిన పనికి అందరూ ఒక్కసారిగా నోళ్లు తెరిచారు. మరి కొందరైతే తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుని అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆమె చేసిన పనికి మండిపడుతూ ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. ఇది మీ ఇల్లు కాదని కొందరు కామెంట్స్ చేస్తే.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.