ఈ మద్య కాలంలో మెట్రో ట్రైన్ లో ప్రయాణికులు కొంతమంది చేస్తున్న చిత్ర విచిత్ర విన్యాసాలు, అసభ్యకరమైన పనుల వల్ల తోటి ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల ఢిల్లీ మెట్రో ట్రైన్ వివాదాలు, ఆసక్తికర ఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రతిరోజూ ఇక్కడ ప్రయాణికుల మధ్య గొడవలు, కొట్టుకోవడాలు, రీల్స్, డ్యాన్స్ లే కాదు కొన్నిసార్లు హద్దులు దాటి ముద్దుల సీన్లు కూడా నడుస్తున్నాయి. వీరి చర్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రైల్వే అధికారులు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తాజాగా మరోసారి ఢిల్లీ మెట్రో ట్రైన్ లో గొడవ జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిత్యం రద్దీ ప్రదేశాల్లో ప్రయాణాలు చేస్తూ అలసిపోవడమే కాదు.. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు, ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి మెట్రో ప్రాజెక్ట్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. బస్సు ప్రయాణాల్లో ఉద్యోగస్థులు, విద్యార్థులు, మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోయాయి. ఈ మద్య మెట్రోలో కొంతమంది చేస్తున్న వెకిలి చేష్టలు, చిత్ర విచిత్ర విన్యాసాలు, కొట్టుకోవడాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ మహిళ యువకుడి చెంప చెల్లుమనిపించింది.
వీడియో కనిపిస్తున్న ప్రకారం.. మెట్రోలో అందరూ చూస్తుండగానే యువకుడి చెంప చెల్లించడంతో అందరూ షాక్ తిన్నారు. అయితే వారిద్దరి గొడవ విషయంలో ఎవరూ తలదూర్చలేదు. జరుగుతున్న దాన్ని సైలెంట్ గా వీక్షిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అటు వైపు తలెత్తికూడా చూడలేదు. ఆ యువకుడిని ఎందుకు కొట్టింది అన్న విషయంపై ఎలాంటి విచారణ కూడా చేయలేదు. వీరి మద్య జరుగుతున్న సన్నివేశం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియోను ఇప్పటి వరకు 64 వేల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లకు ఏం జరిగినా మనకెందుకు అనుకునే వారు.. ఎప్పటికైనా తాము కూడా బాధితులం అవుతామని గుర్తుంచుకోవాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) – Girl slaps him too hard just think if it was vice-versa😀 pic.twitter.com/Y0RiKeYWem
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 3, 2023