ఢిల్లీలో మెట్రోలో ప్రతిరోజూ ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే ఉంది. ప్రేమికుల ముద్దూ ముచ్చట్లు, రీల్స్ కోసం డ్యాన్సులు, ప్రయాణికుల మధ్య గొడవలు ఇలా నిత్యం ఏదో ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ మెట్రోలో అసభ్యకర చేష్టలు, డ్యాన్స్ రీల్స్, ముద్దూ ముచ్చట్లు, తన్నుకోవడాలు ఒక్కటేమిటి ఎన్నో రకాల వీడియోలు చర్చకు దారితీశాయి. ఓ వైపు మెట్రో రైల్ కోచ్ లలో వీడియో రికార్డ్ చేయడాన్ని నిషేదిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. ప్రయాణికుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు.. ప్రతిసారి నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఢిల్లీ మెట్రోలో మరోసారి యువతులు పోల్ డ్యాన్స్ చేస్తూ హంగామా సృష్టించారు. వివరాల్లోకి వెళితే..
మెట్రో రైల్ లో ఇద్దరు యువతులు బాలీవుడ్ సాంగ్ కి ‘పోల్ డ్యాన్స్’ వేస్తూ హల్ చల్ చేశారు. పర్వీన్ బాబీ, శశి కపూర్ నటించిన ‘సుహాగ్’ మూవీలోని ‘మెయిన్ తో బేఘర్ హున్’ అనే పాటకు లిప్ సింగ్ చేస్తూ డ్యాన్స్ చేశారు. అయితే ఈ యువతులు ఎవరో తెలియరాలేదు. గురువారం ట్విట్టర్ లో ఓ నెటిజన్ షేర్ చేస్తూ.. ఢిల్లీ మెట్రోలో పోర్న్, ముద్దు సీన్లు, ఫైటింగ్స్ తర్వాత.. తాజాగా పోల్ డ్యాన్స్’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఇప్పటి వరకు 302,000 కంటే ఎక్కువగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రీల్స్ చేసుకోవడానికి మెట్రో మంచి లొకేషన్ అయ్యిందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మెట్రోలో నిత్యం పోలీసుల చెకప్ చాలా అవసరం.. లేదంటే ముందు ముందు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
After porn, kissing and fighting in Delhi Metro,
The latest is Pole Dancing…..
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023