మెట్రో ట్రైన్స్ లో ఈ మద్యకాలంలో పలు విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మెట్రో స్టేషన్ లో డ్యాన్స్ చేయడం, ట్రైన్ లోపల కొన్ని జంటలు అసభ్యంగా ప్రవర్తించడం చూస్తున్నాం.
కామాతురానాం నభయం నజ్జ.. అన్నారు పెద్దలు. ఈ మద్య కొంతమంది ప్రేమికులు పదిమంది చూస్తారన్న కనీస జ్జానం లేకుండా రోడ్డుపై, మెట్రో ట్రైన్స్ లో ముద్దులతో రెచ్చిపోతున్నారు. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఓ ప్రేమజంట మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటన ఢిల్లీ మెట్రోలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల మెట్రో ట్రైన్ లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్న కనీస ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ట్రైన్ లో బ్రెష్ చేసుకోవడం, స్నానం చేయడం, డ్యాన్స్, హెయిర్ స్ట్రెయిటనర్ చేసుకోవడం, ఘర్షణలు పడటం చేస్తున్నారు. కొంతమంది ఓ అడుగు ముందుకు వేసి ముద్దులు పెట్టుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీ మెట్రో ప్రేమికులకు ప్రైవేటు ప్లేస్ గా మారింది. తాజాగా ఓ ప్రేమ జంట ముద్దు పెట్టుకుంటూ గలీజ్ పనులు చేస్తూ కెమెరాకు చిక్కారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు సిగ్గు విడిచి నలుగురి మధ్యలో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు… పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీ మెట్రో ఎల్లో కారిడార్ లో రైలు హుడా సిటీ సెంటర్ వైపు వెళ్తుంది. ఆ సమయంలో ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.. ఇంతలో ఓ ప్రేమజంట సీట్లో కూర్చొని రొమాన్స్ చేస్తూ ముద్దులు పెట్టుకుంటున్నారు. చుట్టు జనాలు ఉన్న కనీస ఆలోచన లేకుండా ప్రవర్తించారు. ఆ రోమాన్స్ సీన్ ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మెట్రో రైలు అధికారులకు ట్యాగ్ చేశారు. దీనిపై ఢిల్లీ మెట్రో అధికారులు స్పిందించి.. ‘హాయ్ మీకు కలిగిన అసౌకర్యానికి మేం ఎంతో చింతిస్తున్నాం.. హుడా సిటీ సెంటర్ లో పూర్తిగా తనిఖీ చేశాం..కానీ అలాంటి జంట మాకు కనిపించలేదు ’ అంటూ రిప్లై ఇచ్చారు.
Kindly take action ASAP. pic.twitter.com/E0NPg11UUY
— Bhagat S Chingsubam (@Kokchao) June 18, 2023