హైదరాబాద్- కాంగ్రెస్ పార్టీలో సాధారణంగానే ప్రజాస్వామ్యం ఎక్కువ. అందులోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐతే ఇంకాస్త స్వాతంత్ర్యం మరింత ఎక్కవని చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా పదవీ భాద్యతలు స్వీకరించాక, అప్పటికే పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్లు ఆయన్ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రేవంత్ పై భహిరంగంగానే వినర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిగో ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను కలుపుకుపోకుండా, వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని ఆయన ఆరోపించారు.
పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలను అనౌన్స్ చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా అయిన ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం గురించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న తనతో చర్చించలేదని జగ్గారెడ్డి సోనియా, రాహూల్ కు రాసిన లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోయేలా ఆదేశాలు ఇవ్వాలని, లేదంటే పీసీసీ చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించి, అందరినీ కలుపుకొనిపోయే మరోక నేతకు పీసిసీ చీఫ్ గా అవకాశం ఇవ్వాలంటూ జగ్గా రెడ్డి లేఖలో పేర్కొన్నాట్లు సమాచారం. ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి సంబందించి జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడ తప్పుబట్టారు. మొత్తానికి జగ్గారెడ్డి పీసిసి చీఫ్ రేవంత్ పై కంప్లైంట్ చేస్తూ అధిష్టానానికి లేఖ రాయడం పార్టీలో కలకలం రేపుతోంది.