పార్టీ పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలు కొన్నిసందర్భాల్లో మర్యాదపూర్వకంగా కలవడం చూస్తుంటాం.
సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నావారు.. కొన్ని సమయాల్లో ఎంతో మర్యాదపూర్వకంగా కలుస్తుంటారు. అలాంటి సమయంలో వారి మధ్య ఎలాంటి రాజకీయాలు ఉండవని అంటుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీని పార్లమెంట్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల బెంగుళూరు లో విపక్షాల భేటీ జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహూల్ గాంధీ హాజరయ్యారు. తిరిగి ఢిల్లీకి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలించకపోవడంతో భోపాల్ లో అత్యవసరంగా ల్యాండ్ అవాల్సి వచ్చింది. దీనిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరైన సోనియా గాంధీని ఛాంబర్ లో ప్రత్యేకంగా కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా సోనియా ఆరోగ్యం ఎలా ఉందని ఆరాతీశారు.. కొద్దిసేపు కుశల ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత మిగతా పార్టీల నెతలను కలిసి గ్రీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ రోజుల పార్లమెంట్ లో మణిపూర్ వైరల్ వీడియో పై దుమారం రేగింది. కాంగ్రెస్ సహ విపక్ష పార్టీల నేతలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపై చర్చ జరగాల్సిందే అని పట్టుబట్టారు. కాగా, పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై స్పందించారు. ఈ ఘటన యావత్ దేశ ప్రజలందరికీ సిగ్గు చేటు అని అసహనం వ్యక్తం చేశారు. నిందుతులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు నేతలు ఇలా పలకరించుకోవడం ఆనవాయితీ.. ఈ క్రమంలోనే సోనియా గాంధీని ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు.