'నాటు.. నాటు..' పాటకు ఆస్కార్ రావడంలో రాహుల్ సిప్లిగంజ్ భాగమైన సంగతి అందరికీ విదితమే. రాహుల్.. కాల భైరవతో ఈ పాటను ఆలపించారు. ఈ సందర్బంగా అతనిని ఘనంగా సన్మానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ నజరానా కూడా ప్రకటించింది.
తెలుగు ప్రముఖ దర్శకుడు జక్కన్న తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు.. నాటు..’ పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి అందరికీ విదితమే. దీంతో ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, తొలి భారతీయ సినిమా పాటగా నాటు నాటు చరిత్ర సృష్టించింది. ఈ పాటకు గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ ఈ పాటను ఆలపించారు. ఈ సంధర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు పెద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఆన్‌లైన్ క్విజ్ కాంపిటీషన్ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పేద కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ తనకంటూ గుర్తింపు తెచ్చుకొని ఒక ఎత్తైతే, ఆస్కార్ స్థాయికి చేరుకోవడం మరో గర్వకారణం అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించాల్సింది పోయి, ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. రాహుల్ సిప్లిగంజ్‌ను కేసీఆర్ సర్కార్ విస్మరించినా.. తాము గౌరవిస్తామని వెల్లడించారు.
జూన్ 2న క్విజ్ కాంపిటీషన్ లో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేయనున్నట్లు తెలిపిన రేవంత్ రెడ్డి, అదే రోజు రాహుల్ సిప్లిగంజ్ కు పెద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అతనికి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా అందజేస్తామన్నారు. అలాగే, రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఆనాడు కోటి రూపాయల నగదు బహుమతి అందిస్తామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రకటనపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
యువతా “చేయి” కలుపు…
రాజీవ్ గాంధీ క్విజ్ పోటీల పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉంది.
ఆస్కార్ పొందిన ఈ తెలంగాణ కళాకారునికి కాంగ్రెస్ తరపున రూ.10లక్షలు నజరానా ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.కోటి నగదు బహుమతి అందిస్తాం.
యూత్… pic.twitter.com/DC2lRdRE8S
— Revanth Reddy (@revanth_anumula) May 12, 2023