కుమారుడు లేదా కుమార్తెలకు పెళ్లి చేయడంతో తల్లిదండ్రులకు బాధ్యత తీరిపోదు. వారికి పిల్లలు పుడితే.. మనవళ్లు, మనవరాళ్లను చూడాలని, వారితో ఆడుకోవాలని ఊవిళ్లూరుతుంటారు. తాత, నాన్నమ్మ, అమ్మమ్మ అని పిలుపు కోసం పరితపిస్తుంటారు. ప్రస్తుతం ఆ మాధుర్యపు అనుభూతిని పొందుతున్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.
అసలు కంటే వడ్డీ ముద్దని పేరు. అదీ కుటుంబ బాంధవ్యాలకు వర్తిస్తుంది. కుమారుడు లేదా కుమార్తెలకు పెళ్లి చేయడంతో తల్లిదండ్రులకు బాధ్యత తీరిపోదు. వారికి పిల్లలు పుడితే.. మనవళ్లు, మనవరాళ్లను చూడాలని, వారితో ఆడుకోవాలని ఊవిళ్లూరుతుంటారు. ఒక్కోసారి తమ కడుపున పుట్టిన బిడ్డల కన్నా.. వారికి పుట్టే పిల్లల విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటారు. తాత, నాన్నమ్మ, అమ్మమ్మ అని పిలుపు కోసం పరితపిస్తుంటారు. ఇక మనవళ్లు, మనవరాళ్లను గారంబం చేస్తూ.. వారు అల్లరి చేసినా వెనకేసుకొస్తుంటారు. ఇప్పుడు ఇటువంటి మధురానుభూతిలో మునిగి తేలుతున్నారు మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
అవునండీ రేవంత్ రెడ్డికి తాత రూపంలో ప్రమోషన్ వచ్చింది. రేవంత్ రెడ్డి కూతురు నైమీషారెడ్డి గత వారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా మనవడితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ‘నా అమ్మాయి నైమీషా గతవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. మా మనవడి రాకతో మేము ఆశీర్వదించబడ్డామని మీతో పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. బిడ్డకు, తల్లికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్‌లో రేవంత్ రెడ్డి పోస్ట్ పెట్టారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏపీకి చెందిన బిజినెస్‌మెన్ సత్యనారాయణరెడ్డితో 2015లో నైమీషా పెళ్లి జరిగింది. ఏకైక కూతురు కావడంతో నైమీషా పెళ్లిని రేవంత్ గ్రాండ్‌గా నిర్వహించారు. అప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవంత్ ట్వీట్‌కు ఆయన అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
I am happy to share with you all that we are blessed with the arrival of our grandson. My little girl Nymisha delivered a baby boy last week.
I wish all your blessings for the baby and the mother. pic.twitter.com/DZOm1DHVtj
— Revanth Reddy (@revanth_anumula) April 9, 2023