రోజులో ఒక మనిషి కనీసం 6 సార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ ఓ యువతి మాత్రం ఏకంగా 14 నెలలు మూత్రం పోసుకోకుండా ఉండిపోయింది.
కొంతమంది నీరు తక్కువ తాగినా అస్తమానూ మూత్రం వస్తుంటుంది. మూత్రం ఎక్కువ వస్తుందని నీరు తాగడం మానేసేవారు ఉంటారు. అయితే ఒక యువతి ఎంత నీరు తాగినా కూడా మూత్రం రావడం లేదు. మామూలుగా ఒక మనిషి నీరు తాగకపోయినా తినే ఫుడ్ లో ఉండే ద్రవం కారణంగా రోజులో ఏదో ఒక సమయంలో మూత్రం అనేది వస్తుంది. కానీ ఈ యువతికి మాత్రం రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగినా, ద్రవ పదార్థాలు సేవించినా మూత్రం మాత్రం రావడం లేదు. ఒకటి, రెండు రోజులు కాదు ఏకంగా 14 నెలలు ఆమెకు మూత్ర విసర్జన కాలేదు. తాను మూత్ర విసర్జన చేయలేకపోతున్నా అంటూ బాధపడింది. లండన్ కి చెందిన ఎల్లే ఆడమ్స్ (30)కి అక్టోబర్ 2020లో తనకు ఈ విషయం తెలిసింది. ఆమె ఎంత తాగినా గానీ మూత్రం రాలేదు.
తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి సమస్యలు లేవని ఆమె వెల్లడించింది. అందరిలా మూత్రం పోయలేకపోతున్నానని ఆమె బాధపడింది. లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్ అత్యవసరం విభాగంలో చేరినప్పుడు ఆమె మూత్రాశయంలో ఒక లీటరు మూత్రం ఉందని వైద్యులు చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. సాధారణంగా మహిళల్లో మూత్రాశయం అర లీటర్ మూత్రాన్ని మాత్రమే ఉంచుకోగల సామర్థ్యం ఉంటుంది. మగవారిలో మూత్రాశయం 700 మిల్లీలీటర్ల మూత్రం ఉంచుకోగల సామర్థ్యం ఉంటుంది. కానీ ఆడమ్స్ విషయంలో ఆమె మూత్రాశయం మగవారి కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది.
వైద్యులు ఆమెకు అత్యవసర కాథెటర్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఒక ట్యూబ్ ని ఆమె మూత్రాశయంలోకి పంపి మూత్రాన్ని బయటకు తీశారు. ఇలా ఆమె కాథెటర్ ని పెట్టుకుని బాత్రూంకి వెళ్లి మూత్రం పోసుకోవడం, ఇబ్బంది పడితే హాస్పిటల్ కు వెళ్ళేది. ఇలా మూడు వారాల పాటు ఆమె ఇంటికి, హాస్పిటల్ కు తిరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఫౌలర్స్ సిండ్రోమ్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళల్లో ఈ సమస్య వస్తుంది. ఆడమ్స్ కి అనేక పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. క్యాథెటర్ సహాయంతో ఆమె మూత్రవిసర్జన చేయగలుగుతుంది. క్యాథెటర్ లేకపోతే ఆమె మూత్ర విసర్జన చేయలేదు. ఇటీవల ఆమెకు శస్త్రచికిత్స చేసి ఆమె సమస్యను సగానికి తగ్గించారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.