దాయాది దేశం పాకిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం వల్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలకు ఏం చేయాలో తోచడం లేదు. మార్కెట్లో ఏ వస్తువూ కొనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ పాక్ యువకుడు తమ దేశ పరిస్థితులపై మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఆకాశాన్నంటిన ధరలుతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గోధుమ పిండి కోసం కూడా జనాలు కొట్టుకుంటున్నారంటేనే అక్కడ ఆకలి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఓ పాక్ పౌరుడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు తమ దేశంలో పరిస్థితుల గురించి వివరిస్తూనే.. మరోవైపు దాయాది దేశ ప్రధాని మోదీని మెచ్చుకుంటూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మోదీని పాక్‌కు పంపండి అంటూ ఆ యువకుడు చేసిన వ్యాఖ్యల వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
పాక్‌లోని మాజీ జర్నలిస్టు, యూట్యూబర్ సనా అంజాద్ తాజాగా ఓ కార్యక్రమం నిర్వహించారు. తమ దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ‘బతకాలంటే పాక్ నుంచి పారిపోండి.. ఇండియాలో ఆశ్రయం పొందైనా సరే!’ అంటూ ప్రోగ్రామ్ చేశారు. ఈ క్రమంలో వీధుల్లో ఉన్న ఒక యువకుడ్ని ఆమె మాట్లాడించే ప్రయత్నం చేశారు. పాక్‌లో నెలకొన్న పరిస్థితులపై యువకుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్‌తో పోల్చుకోవడాన్ని పాకిస్థాన్ మానేయాలన్నారు. 1947 విభజన సమయంలో రెండు దేశాలు విడిపోకుండా ఉండాల్సిందన్నాడు. అలా జరగకపోయి ఉంటే.. ఇప్పుడు మనం (పాక్ ప్రజల్ని ఉద్దేశించి) అన్ని వస్తువులను అందుబాటు ధరల్లోనే కొనుక్కునేవాళ్లమని చెప్పాడు.
‘పాక్ కంటే భారత్ చాలా నయం. ఆ దేశ ప్రధాని మోదీ అక్కడి ప్రజల్ని ఎంతో గౌరవిస్తారు. ఒకవేళ మనకే మోడీ ఉండి ఉంటే.. ఈ నవాజ్ షరీఫ్‌లు, బెనజీర్ భుట్టోలు, ఇమ్రాన్ ఖాన్లు, ముషార్రఫ్‌ల అవసరం ఉండేది కాదు. ఆయన ఒక్కడు ఉంటే చాలు. దేశంలోని అన్ని సమస్యలను చకచకా చక్కబెట్టేవారు. భారత్‌తో పాక్‌ను పోల్చొద్దు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. మరి, మనం ఎక్కడ ఉన్నాం. మాకు మోదీ కావాలి. అలాంటి నాయకుడు ఎనిమిదేళ్లు పాలిస్తే దేశంలోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అల్లా మాకు మోదీని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అని పాక్ యువకుడు భావోద్వేగంగా చెప్పడాన్ని వీడియోలో చూడొచ్చు.
“Hamen Modi Mil Jaye bus, Na hamen Nawaz Sharif Chahiye, Na Imran, Na Benazir chahiye, General Musharraf bhi nahi chahiye”
Ek Pakistani ki Khwahish 😉 pic.twitter.com/Wbogbet2KF
— Meenakshi Joshi ( मीनाक्षी जोशी ) (@IMinakshiJoshi) February 23, 2023