దాయాది దేశం పాకిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం వల్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలకు ఏం చేయాలో తోచడం లేదు. మార్కెట్లో ఏ వస్తువూ కొనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ పాక్ యువకుడు తమ దేశ పరిస్థితులపై మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటటం, పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, పతనమవుతున్న కరెన్సీ విలువ, తీవ్ర ద్రవ్యోల్బణం లాంటివన్నీ.. పాక్‌ను పట్టిపీడిస్తున్నాయి. వీటి నుంచి బయటపడలేక పాక్ విలవిలలాడుతోంది. ఇప్పటికే.. సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి కోత పెట్టింది. ఇదిలావుంటే.. పాక్ లో చోటుచేసుకున్న ఒక హృదయ విదారకర సంఘటన యావత్ ప్రపంచానికి కన్నీళ్లు తెప్పిస్తోంది. పాకిస్థానీలు గోధుమ పిండి కోసం విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. పాకిస్థాన్‌లో […]
సీనియర్ నటి సుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించింది. అమ్మ, అక్క, అత్త ఇలాంటి పాత్రలు అంటే ముందుగా సుధానే గుర్తుకు వస్తుంది. తన నటనతో.. అమ్మ, అత్త అంటే ఇలా ఉండాలి అనే రేంజ్‌లో గుర్తింపు తీసుకువచ్చింది సుధ. సినిమాలను పక్కకు పెడితే.. నిజ జీవితంలో.. చాలా కష్టాలను అనుభవించింది సుధ. దీని గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘నేను పుట్టడమే.. ధనవంతుల […]
గత ఏడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. భారత్ సహా ప్రపంచ దేశాల ఆర్థిక సహాయంతో సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఆ దేశం. తాజాగా శ్రీలంక దారిలోనే పాకిస్తాన్ కూడా వెళ్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. అక్కడ వంట గ్యాస్ కొనాలంటే జనానికి చుక్కలు కనబడుతున్నాయి. భారత్ లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1100 ఉంటేనే లబోదిబోమనే పరిస్థితి. అంతకు మించి ఒక్క రూపాయి పెరిగినా […]
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. తినడానికి తిండిలేక ప్రజలు పస్తులుండాల్సిన దుస్థితి. ఇప్పుడు అక్కడి మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రత్యేకించి వస్త్రపరిశ్రమల్లో పనిచేసే మహిళలు.. ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. కుటుంబ పోషణ, ఆకలి కేకలతో మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. ఇంట్లోకి సామాన్ల కోసం దుకాణదారులకు ఒళ్లు అమ్ముకుంటున్న దీనస్థితిని అనుభవిస్తున్నారు. ‘ఒకప్పుడు ఏదో పనిచేసుకుని బతికేవాళ్లం. మా […]
శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ఏకంగా అధ్యక్షుడు గోటబయ రాజపక్షే ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఆయన దేశాన్ని విడిచి పారిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత.. ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే సైతం తన పదవికి రాజీనామా చేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశీ మారక నిల్వలు లేక.. ద్రవ్యోల్భణం తారా స్థాయికి చేరిపోవడంతో.. […]
ఇరుగుపొరుగు ఇండ్లకు, సరిహద్దు దేశాలకు పెద్ద తేడా లేదు. మన ఇంటి చుట్టు పక్కల ఇండ్లు బాగుంటేనే మనకు మనఃశాంతి. మన చుట్టు పక్కల దేశాలు బాగుంటేనే దేశానికి ఆర్థికంగా, భద్రతాపరంగా మంచిది. కానీ, ప్రస్తుతం మన చుట్టూ ఉన్న దేశాల్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఇండియాకు తలనొప్పిగా మారాయి. మిత్రదేశమైన శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా.. దాయాది దేశం పాకిస్తాన్ సైతం అదే బాటలో పయనిస్తోంది. తాజాగా ఖర్చులను తగ్గించుకోవడానికి టీ తాగొద్దని.. వంట […]
ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరగలేదంటూ.. ఓ మాజీ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 24 గంటల పాటు నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించాడు. 2019లో ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 269 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. కాగా ఈ కుట్ర వెనుక సూత్రధారులపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతో […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా తో మరణాలు మాత్రమే కాదు.. ఆర్థిక సంక్షోభం విపరీతంగా నెలకొంది. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ పొరుగు దేశం శ్రీలంకపై భారీగానే పడింది. దీనికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్ – రష్యా ల మద్య కొనసాగుతున్న యుద్దం మరింత ప్రభావం చూపిస్తుంది. గత కొంత కాలంగా శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఇక్కడ నిత్యావసరాల ధరలు తాజాగా అమాంతం పెరిగిపోయాయి. కనీసం ఆహార […]