అదృష్టం అంటే ఇతడిదే. కోట్ల రూపాయల జాక్‌పాట్ కొట్టాడు. ఆస్తి విషయంలో ఏకంగా నిమిషాల్లో రతన్ టాటాను మించిపోయాడు. అసలు ఆ స్టోరీ ఏంటంటే..!
జీవితంలో పైకి రావాలంటే బాగా కష్టపడాలని అంటుంటారు. అలా శ్రమను, ప్రతిభను నమ్ముకుని ఎదిగిన వాళ్లను చూస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది విషయంలో ఈ సూత్రం పనికిరాదనే చెప్పాలి. హార్డ్‌వర్క్ కంటే కూడా అదృష్టంతో కూడా ఉన్నతస్థాయికి చేరుకున్న వాళ్లూ ఉన్నారు. అయితే ఆ స్థాయిని కాపాడుకోవడం మాత్రం కష్టమనే చెప్పాలి. ఇదిలాఉంటే.. యూఎస్ కాలిఫోర్నియాలోని ఓ వ్యక్తిని అదృష్ట దేవత కరుణించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాటరీ గెలుచుకుని రాత్రికి రాత్రే బిలియనీర్‌గా అవతరించాడో వ్యక్తి. ఏకంగా వేల కోట్లు రూపాయల జాక్‌పాట్ తగలడంతో అస్సలు ఆలస్యం చేయకుండా వరల్డ్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఇంటిని సొంతం చేసుకుని మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడతను.
బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్ రిపోర్డు ప్రకారం.. కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ కాస్ట్రో అనే వ్యక్తి అమెరికా హిస్టరీలోనే అత్యంత విలువైన పవర్‌బాల్ మెగా లాటరీని గెలుచుకున్నాడు. 2022, నవంబర్‌లో 2 బిలియన్ డాలర్ల ( భారత కరెన్సీలో సుమారుగా రూ.16,407 కోట్లు) లాటరీని నెగ్గడం ద్వారా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ లాటరీని యూఎస్‌లో ఇప్పటిదాకా కేవలం నలుగురు మాత్రమే గెల్చుకున్నారు. కాగా, తాజా లాటరీలో ట్యాక్స్, ఇతర తగ్గింపులు పోనూ మొత్తం రూ.8,180 కోట్లు కాస్ట్రో చేతికి వచ్చాయట. దీంతో ఓవర్‌నైట్ అతడి లైఫ్ మారిపోయింది. హాలీవుడ్ సెలెబ్రిటీలు, ఇతర ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతంలో రూ.200 కోట్ల అతి ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశాడు కాస్ట్రో.
అరియానా గ్రాండే, డకోటా జాన్సన్, జిమ్మీ కిమ్మెల్ లాంటి సెలబ్రిటీల పొరుగువాడిగా చేరిపోయాడు కాస్ట్రో. ఆస్తి విషయంలో భారత ప్రసిద్ధ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటాను కూడా అధిగమించాడు. టాటా వ్యక్తిగత ఆస్తుల కంటే కాస్ట్రో ఆస్తులు నాలుగు రెట్లు ఎక్కువని ఇండిపెండెంట్ స్పష్టం చేసింది. రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి దాదాపుగా రూ.4 వేల కోట్ల రూపాయలు అని తెలిపింది. కాస్ట్రో కొన్న ఇల్లు విస్తీర్ణం 13,500 చదరపు అడుగులు. ఐదు లగ్జరీ రూములు, అధునాతన సదుపాయాలతో ఉన్న ఏడు బాత్రూమ్లు, ఇన్ఫినిటీ పూల్, రెండు ఫైర్ పిట్స్, ఔట్‌డోర్ కిచెన్, స్పా అండ్ సౌరా, మూవీ థియేటర్, ఫిట్నెస్ స్టూడియో, రూఫ్‌టాప్ డెక్, ఫైవ్ కార్ షోరూం, రెండు కార్ల గ్యారేజీలతో పాటు ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
Powerball winner buys massive $25.5 Million Hollywood Hills home 👀💰 pic.twitter.com/vfBnPFXYhu
— Daily Loud (@DailyLoud) March 8, 2023