రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా ఉండిపోయిన బాంబులు తరచూ కనిపిస్తుంటాయి. ఇలా బయటపడ్డ బాంబులు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా నిర్మాణ రంగంలోనివారికి, రైతులకు కనిపిస్తుంటాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకు జర్మనీలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దళాలు యూరోపియన్ దేశాలపై భారీగా దాడులు చేశాయి. అలాంటి ప్రాంతాల్లో బ్రిటన్‌లోని ఎక్సెటర్ కూడా ఒకటి. అలాగే లూబెక్‌పై బ్రిటన్ బాంబు దాడులకు ప్రతీకారంగా, జర్మనీ సేనల్లో ఉత్సాహం నింపడం కోసం ఎక్సెటర్ ప్రాంతంలో బాంబుల వర్షం కురిపించింది హిట్లర్ సైన్యం. అప్పుడు వేసిన బాంబులు కొన్ని పేలాయి కొన్ని పేలలేదు. నిపుణుల అంచనా ప్రకారం, కనీసం 10శాతం బాంబులైనా పేలి ఉండవు.
ఎక్సెటర్‌లో చేసిన దాడిలో 7వేల హైఎక్స్‌ప్లోజివ్ బాంబులు, ఇన్సెండియరీ బాంబులు ఉపయోగించారు. వాటిలో 40 హైఎక్స్‌ప్లోజివ్ బాంబులు పేలలేదట. వాటిలో ఒకటి ఇక్కడ తాజాగా బయటపడింది. ఇంటికి మరమ్మతులు చేస్తుండగా ఈ బాంబు బయటపడింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే బాంబు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలందరినీ ఆ ప్రాంతం ఖాళీ చేయించారు. ఆ తర్వాత భద్రతా చర్యలు తీసుకొని ఆ బాంబును పేల్చేశారు. ఈ బాంబు 2,200 ఎల్‌బీ అంటే వెయ్యికేజీల బాంబట. ఎక్సెటర్‌లో కనిపించన బాంబుల వంటివి చాలా అరుదని నిపుణులు వివరించారు. 2010 జూన్ లో గోటిజెన్‌లో నిర్మాణ పనులు జరుగుతున్న చోట బయటపడ్డ బాంబును నిర్వీర్యం చేసే ప్రయత్నంలో బాంబు నిర్వీర్యక సిబ్బంది ముగ్గురు చనిపోయారు. ఇలా ప్రపంచ యుద్ధంలో పేలని బాంబులు భూమిలో మిగిలిపోయాయి. వీటితో బాంబ్ సెన్సస్ పేరిట ఒక జాబితా కూడా తయారు చేసుకున్నాయి. చాలా కాలం భూమిలో ఉండిపోవడం వల్ల వీటి ఫ్యూజులు తుప్పు పట్టిపోయి డిస్‌ఫ్యూజ్ చేయడం కుదరదు. దాంతో పేల్చేయడం ఒక్కటే మార్గం. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2010 నుంచి 2018 వరకూ ఏటా సుమారు 60 బాంబులు దొరికేవని ఇంగ్లండ్ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటికి దాదాపు 45వేల బాంబులు ఇలా బయటపడి ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు