చదువుతో ఏదైనా సాధించొచ్చని నిరూపించాడో యువకుడు. బాగా చదువుకొని ఏకంగా రూ.కోట్ల జాబ్ ఆఫర్‌ను కొట్టాడు.
చదువు.. ఎవరి జీవితాన్నైనా మారుస్తుంది. బాగా చదువుకుంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ఇందుకు చాలా మందిని ఉదాహరణగా చెప్పొచ్చు. నిరుపేద కుటుంబంలో పుట్టి చదువు ద్వారా ఉన్నతస్థాయికి చేరుకున్న వారు ఎందరో ఉన్నారు. చదువు ఒక ఆయుధం అనే చెప్పాలి. దాన్ని సరిగ్గా వినియోగిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. దీన్ని మరోసారి ప్రూవ్ చేశాడో యువకుడు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ యాసిర్ మహ్మద్. అతడు ఒక జర్మన్ కంపెనీలో ఏకంగా రూ.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో జాబ్‌లో చేరి శభాష్ అనిపించుకున్నాడు. ఎల్పీయూ పూర్వ విద్యార్థి అయిన యాసిర్.. 2018లో వర్సిటీ నుంచి పాసవుటై ప్లేస్‌మెంట్స్‌లో సరికొత్త చరిత్రను రాశాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్టుల్లో యాసిర్ మహ్మద్ పనిచేయనున్నాడు. ఎల్పీయూలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో ట్రైనింగ్‌లో నేర్చుకున్న అంశాలే తన సక్సెస్‌కు కారణమని యాసిర్ చెప్పుకొచ్చాడు. అతడి కోసం టాప్ కంపెనీలు పోటీ పడగా.. ఒక సంస్థ ఇచ్చిన రూ.3 కోట్ల ఆఫర్‌కు యాసిర్ ఒప్పుడుకున్నాడు. ఇక, ఎల్పీయూలో చదువుకొని భారీ ప్యాకేజీతో జాబ్ కొట్టిన వారిలో యాసిర్‌తో పాటు ఎంతో మంది ఉన్నారు. దిగ్గజ ఐటీ సంస్థలైన గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌ల్లో రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజీతో ఎంపికైన విద్యార్థులు చాలా మందే ఉన్నారు. ప్లేస్‌మెంట్స్ విషయంలో భారత్‌లోని యూనివర్సిటీల్లో ఎల్పీయూ ఈ విధంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ కనిపిస్తుండటంతో ఎల్పీయూ నుంచి భారీ సంఖ్యలో స్టూడెంట్స్‌ను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.