చూయింగ్ గమ్ బెలూన్స్ తో భారీగా సంపాదిస్తున్న మహిళ. అవును.. మీరు చదివింది నిజమే. నోటితో చూయింగ్ గమ్ బెలూన్స్ ఊదుతూ ఆ మహిళ నెలకు బాగానే సంపాదిస్తుంది. ఇంతకి ఆమె సక్సెస్ స్టోరీ ఏంటనేది తెలుసుకోవాలనుందా?
అబ్బ సొత్తు కాదు రా టాలెంట్.. ఎవడబ్బా సొత్తు కాదు రా టాలెంట్ అనే సాంగ్ మనం వినే ఉంటాం. టాలెంట్ ఉంటే ఎవడైన పైకొస్తాడు. ఏ టాలెంట్ లేనోడే ఊళ్లో అరుగుల మీద కూర్చుంటారని అంటుంటారు. అయితే ఈ రోజుల్లో పీజీలు చదివిన వాళ్లు కూడా ఊళ్లో పని పాట లేకుండా తిరుగుతున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం బతకడానికి ఏదో పని చేయాలంటూ ఏది పడితే అది చేస్తూ నాలుగు పైసలు సంపాదిస్తున్నారు. మొత్తానికి టాలెంట్, ఐడీయాలు ఉంటే ఏదైన చేయోచ్చని చాలా సార్లు నిరూపితమైంది. కానీ, ఓ మహిళ మాత్రం.. చూయింగ్ గమ్ బెలూన్స్ తో నెలకు భారీగా సంపాదిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. రోజూ చూయింగ్ గమ్ బెలూన్స్ ఊదుతూ నెలకు బాగానే సంపాదిస్తుంది. ఆ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
జర్మనీలోని ఓ ప్రాంతంలో 30 ఏళ్ల జూలియా ఫోరట్ అనే మహిళ నివాసం ఉంటుంది. కష్టపడి కాకుండా తెలివిగా డబ్బులు ఎలా సంపాదించాలని అనుకుంది. అందుకోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఇక చివరగా తన స్నేహితుడు ద్వారా చూయింగ్ గమ్ బెలూన్స్ తో బాగానే సంపాదించవచ్చని తెలుసుకుంది. మొదట్లో నమ్మకం లేకుండా ప్రయత్నించింది. కానీ, మెల్ల మెల్లగా ఆమె చేసే పనిపై అందరి దృష్టి పడడంతో ఆమెకు పేరుతో పాటు డబ్బులు కూడా వచ్చాయి. దీంతో ఆమె నెలకు కేవలం 480 ఖర్చుతో మన ఇండియా కరెన్సీ ప్రకారం.. రూ.67 వేల వరకు సంపాదిస్తుందట.
ఇంతకు ఆమె పనేంటంటే? ముందుగా కొనుగోలు చేసిన చూయింగ్ గమ్ ను బాగా నములుతుంది. ఆ తర్వాత నమిలిన దానిని బెలూన్స్ గా ఊదుతుంది. నమలడం, ఊదడం ప్రియను వీడియో తీసుకుంటుంది. ఇక అదే వీడియోను My. Club, ఆన్ లైన్ ద్వారా షేర్ చేస్తుంది. డిఫరెంట్ కంటెంట్ తో అందరి దృష్ఠిని ఆకర్షించడంతో చాలా మంది ఆమె వీడియోలను చూడడం మొదలు పెట్టారు. ఇక రాను రాను ఆమె టాలెంట్ కు అందరూ ఫిదా అయి వ్యూస్ ఎక్కువగా రావడంతో బాగానే సంపాదిస్తుంది. ఇలా నోటి ద్వారా ఊదిన చూయింగ్ గమ్ బెలూన్స్ ను షేర్ చేయడం వల్ల నెలకు రూ. 67 వేల వరకు సంపాదిస్తున్నట్లు జూలియా ఫోరట్ తెలిపింది.