దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓచుక్కాని. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా ఇప్పుడు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించతోంది. 34 ఏళ్ల సానియా ఇండియా తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలవబోతోంది. ఇక టోక్యో ఒలింపిక్స్ లో సానియా మీర్జా డబుల్స్ విభాగంలో పోటీ పడుతోంది. అంకితా రైనాతో కలిసి బరిలో దిగనుంది సానియా. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సానియా టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఈ ఒలింపిక్స్ లో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మొత్తం 11 వేల మంది పాల్గొనబోతున్నారు.
సానియా మీర్జా కూడా సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో సానియా ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అమెరికన్ రాపర్ డోజా క్యాట్ హిట్ సాంగ్ ‘కిస్ మి మోర్’ కు క్యూట్ స్టెప్పేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మంచి కామెంట్ కూడా జతచేసింది. తన పేరులో వచ్చే ఇంగ్లీష్ లెటర్ ‘A‘ను విస్తరిస్తే అందులో చాలా జీవితం ఉంది. దూకుడు ఆశయం సాధించడం ఆప్యాయత అన్నీ అందులో ఉన్నాయని రాసుకొచ్చింది సానియా. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి లైకుల వర్షం కురుస్తోంది.
టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జాకు ఫ్యాన్స్ కూడా సాలీడుగానే ఉన్నారు. సానియా మీర్జా టెన్నిస్ కోర్టులోనే కాదు, సోషల్ నెట్ వర్క్ ట్విట్టర్లోనూ హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు ఆమె ట్విట్టర్ మిలియనీర్. తన పర్సనల్ విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్టు చేసింది. ఇందులో కొత్త ఒలింపిక్ జెర్సీని ధరించి డ్యాన్స్ చేసింది.