భారత దేశంలో ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తరుచూ ప్రమాదాలకు గురి అవుతూ వస్తున్నాయి. కొన్ని చోట్ల ఆకతాయిలు ఈ ట్రైన్ పై రాళ్లు రువ్విన ఘటనలు వెలుగు చూశాయి. మరికొన్ని చోట్ల పశువులను తాకడం వల్ల ప్రమాాదాలకు గరైన ఘటనలు జరిగాయి.
మనం దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణంలో సౌకర్యవంతంగా ఉండాలని ఆలోచిస్తాం. అందుకు చాలామంది రైలు ప్రయాణం ఉత్తమమని భావిస్తారు.రైళ్లలో కూడా హై స్పీడ్, సెమీ హై స్పీడ్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు అని ఉన్నాయి. త్వరగా గమ్యస్థానం చేరడానికి వీటిని మనం ఎంచుకుంటాం. ఈమధ్య వందే భారత్ ట్రైన్స్ పలు రాష్ట్రాల్లో మన ప్రధాని మోడీ ప్రారంభించారు. సెమీ హై స్పీడ్ తో వెళ్లే వందే భారత్ రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రయాణ సౌకర్యంగా ఉన్నాయంటూ ప్రయాణికులు అంటున్నారు. కాకపోతే ఈ ట్రైన్స్ ప్రారంభించిన్పటి నుండి ఏదో ఓ చోట రాళ్ల దాడులు, జంతువులను ఢీ కొనడం మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా వందే భారత్ రైలును ప్రధాని మోడీ పోయిన గురువారమే ప్రారంభించారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకు పోయాయి.. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఎండకాలం ఇలాంటి వర్షాలు పడటం ఎవరూ ఊహించలేకపోతున్నారు. భారీగా వీచిన ఈదురుగాలులతో చెట్టుకొమ్మలు వందే భారత్ రైలుపై విరిగి పడ్డాయి. అదృష్టం కొద్ది ఎవరికీ గాయాలు కాలేదు కానీ, విండో షీల్డ్ పై కొమ్మలు పడడంతో అద్దాలు పగిలిపోయాయి. ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లా బైతరణి రోడ్-మంగ్గీ రోడ్ స్టేషన్ ల మధ్య ఈ ఘటన జరిగింది. పాంటో గ్రాఫ్ లో చెట్ల కొమ్మలు ఇరుక్కుపోవడంతో రైలుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీజిల్ ఇంజిన్ సాయంతో మంగ్గీ రోడ్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. కమర్షియల్ ఆపరేషన్ మొదలైన రెండోరోజున ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.