వాట్సాప్ అంటే తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండరు. కానీ, వాట్సాప్ వాడాలి అంటే కచ్చితంగా మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. కానీ, ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ సాయంతో మీరు ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ ని యూజ్ చేయచ్చు.
సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మెసేజ్ చేసుకోవడానికి, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్, ఆఫీస్ మీటింగ్.. ఇలా పలు రకాల అవసరాల కోసం వాట్సాప్ ని వాడుతున్నారు. అయితే ఎలా వాడినా కూడా వాట్సాప్ వాడాలి అంటే మీకు కచ్చితంగా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. అది లేకుండా మీరు వాట్సాప్ ని వాడేందుకు వీలు ఉండదు. ఇప్పుడు వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చిందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ ఫీచర్ ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ చాట్ చేయచ్చు. అది వాట్సాప్ వాళ్లు అధికారికంగా తీసుకొచ్చిన సదుపాయమే.
వాట్సాప్ ఎప్పుడూ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు విడివిడగా ఫీచర్స్ ని తెస్తుంటారు. తీసుకొచ్చే ప్రతి ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడటమే కాకుండా.. వారికి వాట్సాప్ వాడకాన్ని మరింత సులభతరం చేస్తుంటుంది. అయితే తాజాగా వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. ఆ ఫీచర్ ద్వారా మీరు వాట్సాప్ ని మొబైల్ డేటా లేకుండానే వాడేయచ్చు. ఆ వార్త వినగానే వినియోగదారుల్లో పలు ప్రశ్నలు రేకెత్తాయి. అసలు ఆ ఫీచర్ ఎలా వాడాలి? నిజంగానే పనిచేస్తుందా? అనే విషయాలు చూద్దాం.
వాట్సాప్ తీసుకొచ్చిన ఆ సరికొత్త ఫీచర్ వాట్సాప్ ప్రాక్సీ. మీకు మొబైల్ డేటా లేని సమయంలో మీరు ఈ వాట్సాప్ ప్రాక్సీ ద్వారా చాట్ చేసేందుకు వీలుంటుంది. మీరు సెట్టింగ్స్ లో స్టోరేజ్ అండ్ డేటా మీద క్లిక్ చేస్తే.. లాస్ట్ లో ప్రాక్సీ సెట్టింగ్స్ అని ఉంటాయి. మీకు సెట్టింగ్స్ కనిపించకపోతే.. లేటెస్ట్ వర్షన్ కి అప్ డేట్ చేసుకోండి. అది క్లిక్ చేసిన తర్వాత ప్రాక్సీ అడ్రస్ ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే మీకు చెక్ మార్క్ కనిపిస్తుంది. అప్పుడు చాట్ చేసుకోవచ్చు. కానీ, అత్యవసరం అయితేనే ప్రాక్సీని వినియోగించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రాక్సీ చేయడం వల్ల మీ ఐపీ అడ్రస్ ప్రాక్సీ ప్రొవైడర్ కి తెలిసిపోతుంది. అలాగే ప్రాక్సీ సమయంలో ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆన్ లో ఉందో లేదో చూసుకోవాలి. వాట్సాప్ తీసుకొచ్చిన ప్రాక్సీ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.