సమాజంలో కొందరు భర్తలు వివిధ కారణాలతో భార్యలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. కట్నం సరిపోలేదనో, పిల్లలు పుట్టలేదనో, ఆడపిల్లలు పుట్టారనో భార్యను చిత్రహింలు పెడుతుంటారు. మగ పిల్లలు పుట్టలేదని మరికొందరు భార్యను వదిలిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి.. తన భార్యను విచిత్ర కారణంతో విడిచిపెట్టాడు. ఐదవసారి కూడా ఆమె కవలలకు జన్మనివ్వడంతో భర్త బెంబేలెత్తిపోయాడు. వరుసగా ఐదుసార్లు కవలలు పుట్టడాన్ని భర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ మహిళ ఇప్పటికే 10 మంది పిల్లలకు తల్లి అయ్యింది. ఆఫ్రికాలోని ఉగాండాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 5వ సారి కవలలకు జన్మనిచ్చిన నాలోంగో గ్లోరియా అనే మహిళను ఆమె భర్త స్లాంగో విడిచిపెట్టాడు. ఆ మహిళ ఇటీవలే తొమ్మిది, పదవ పిల్లలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో నాలోంగో గ్లోరియా అనే మహిళ వరుసగా ఐదుసార్లు కవలలకు జన్మనిచ్చింది. అలా గ్లోరియా ఇప్పటికే 8 మందికి జన్మనిచ్చిన గ్లోరియా తాజాగా ఐదవ కాన్పులో మరో ఇద్దరికి జన్మనిచ్చింది. దీంతో మొత్తం 10 మంది పిల్లలు పుట్టే సరికి ఆమె భర్త పిల్లల్ని పెంచలేను అని బెంబేలెత్తిపోయి పారిపోయాడు. భర్త ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లిపోయాడో గ్లోరియాకు ఇంతవరకూ తెలియదు. దీంతో పిల్లలను పెంచే భారం ఆమెపై పడింది. ఇటువంటి దుస్థితిలో గ్లోరియా మీడియాతో మాట్లాడుతూ తాను మూడవసారి గర్భవతిని అయి కవలలకు జన్మనిచ్చినప్పుడు.. ఇదే చాలా ఎక్కువ.. ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నాడని ఆమె తెలిపింది.
కొంతకాలం తరువాత బాగానే ఉన్నాడని, ఇప్పుడు ఐదవసారి కూడా కవలలు పుట్టేసరికి తన భర్త ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదని గ్లోరియా ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై అంతా దేముడిదే భారమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే పెద్ద దెబ్బ అనుకుంటే గ్లోరియాకు మరో సమస్య వచ్చి పడింది. ఇంటిని ఖాళీ చేయాలని ఇంటి యజమాని చెప్పటంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితితో తల్లడిల్లిపోతోంది గ్లోరియా. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
ఇదీ చదవండి: పాపం! తన పళ్లను తానే పీక్కుంది.. ఎందుకంటే!
ఇదీ చదవండి: Viral Video: గుర్రంపై స్వారీ చేస్తున్న శునకం.. వీడియో
ఇదీ చదవండి: Sanitation Workers: భారీ డిమాండ్: అక్కడ నెలకు లక్షలు సంపాదిస్తున్న పారిశుధ్య కార్మికులు!