భారత్‌లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారిపై వ్యాక్సిన్ తయారీ సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి రెండేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాన్పూర్ దేహాట్ నగరానికి చెందిన రెండేళ్ల బాలికకు కోవాక్సిన్ మొదటి డోసు టీకా వేశారు. ప్రస్తుతానికి గర్భిణులు, పాలిచ్చే తల్లులను లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదు. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, కాలేయ సమస్యలు, థైరాయిడ్ ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలపై మూడు దశల ట్రయల్స్ పూర్తి అయిన తర్వాత పిల్లలకు కోవాక్సిన్ డేటా సెప్టెంబరు నాటికి లభిస్తుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
ఉత్తరప్రదేశ్ పిల్లలపై క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతితో భారత్ బయోటెక్ పరీక్షలు ప్రారంభించింది. కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్న బాలిక కాన్పూర్ దేహాట్ నగరంలోని ఓ ప్రైవేటు వైద్యుడి కుమార్తె కావడం విశేషం. 2 నుంచి 6 సంవత్సరాల వయసు గల ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురకు కొవిడ్ టీకాలు వేశారు. భారత్‌లో ప్రజలకు ఇస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు రెండూ మంచివే. సమర్థత, భద్రత విషయంలో రెండు టీకాలు మంచి ఫలితాలు నమోదు చేశాయి.