జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్లుగా రాత్రికి రాత్రే అందరూ కోటీశ్వరులై పోతున్నారు. పేరుకు జూదం కాకపోయినా జూదం వంటి లాటరీ రూపంలో వారిని అదృష్టం తలుపు తడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అబుధాబిలో రూ.2.2 కోట్లు గెల్చుకుంది.
లాటరీలో కోట్లు గెలుచుకోవడమన్నది ఈరోజుల్లో కామన్ అయిపోయింది. రాత్రికి రాత్రే అదృష్టం వారి తలుపుతట్టి కోట్లు గడిస్తున్నారు. అలా అని ఒకటో.. రెండో అనుకుంటే పొరపాటు. కొన్ని సందర్భాల్లో వందల కోట్ల రూపాయలు లాటరీ రూపంలో సొంతం చేసుకుంటున్నారు. ఇలానే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అబుధాబిలో రూ.2.2 కోట్లు గెల్చుకుంది. మెహ్జూజ్ సంస్థ నిర్వహించిన లక్కీ డ్రాలో పది లక్షల దిర్హామ్‌ల బహుమతి దక్కించుకున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఆ వివరాలు..
హైదరాబాద్‌కు చెందిన హమీదా బేగం అనే మహిళ యూఏఈ రాజధాని అబుధాబిలో నివసిస్తోంది. గత మూడేళ్లుగా మెడికల్ కోడర్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె మెహ్జూజ్ సంస్థ నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ లాటరీ కొనుగోలు చేసింది. అదృష్టం కొద్దీ ఆ లాటరీ ఆమెను వరించింది. 1లక్కీ డ్రా ఈ నెల 1న నిర్వహించగా, తాజాగా విజేతలను వెల్లడించారు. గెలుచుకున్న సొమ్మును తన నలుగురి పిల్లల విద్యాభ్యాసంతోపాటు కుటుంబ పోషణకు వినియోగిస్తానని హమీదా వివరించింది. కాగా లక్కీ డ్రాలో పదిలక్షల దిర్హామ్‌లు గెలుచుకున్న తొలి మహిళగా ఆమె నిలిచింది.
Hameda is our latest Mahzooz Millionaire by taking home our weekly AED 1,000,000 guaranteed raffle draw prize 🤩 You could be next simply by participating in our weekly draw for only AED 35! Visit https://t.co/1cNLERe6K1 now!
Live the good life 💙
*T&Cs apply pic.twitter.com/mXPufsOu46— Mahzooz (@MyMahzooz) April 5, 2023
Meet Hameda, the lucky AED 1,000,000 Mahzooz winner! 💙💛🤍
We live up to creating a Millionaire story every week and you could be our next millionaire. Participate now in our weekly draws and win GOLD and MILLIONS!https://t.co/B5PSrfCTiT
*Terms & Conditions apply pic.twitter.com/a23EjRtELW— Mahzooz (@MyMahzooz) April 11, 2023