ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’కు ఫ్రాన్స్‌కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ భారీ జరిమానా విధించింది. ఫ్రాన్స్‌లో రెండవ అతిపెద్ద యాంటీట్రస్ట్ పెనాల్టీ అని తెలుస్తోంది. వార్తా సంస్థలు, గూగుల్ మధ్య చాలా కాలంగా పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే. తమ వార్తల్ని ‘గూగుల్ న్యూస్’లో ప్రచురించి ప్రకటనల రూపంలో అల్ఫాబెట్ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానుల వాదన. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల్సి తీసుకొచ్చాయి. మీడియా సంస్థలకు చెందిన వార్తల్ని ప్రచురించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు గూగుల్‌కు కొంత సమయం ఇచ్చాయి. ప్రకటనల ఆదాయంలో బిలియన్ల యూరోలను ఆకర్షించిన గూగుల్ యూరోపియన్ ప్రచురణకర్తలకు ఆదాయాన్ని పంచడంలో విఫలమైందనే అభియోగాలు ఉన్నాయి.
రాబోయే రెండు లేదా మూడు నెలల్లో వార్తా సంస్థలకు ఇతర పబ్లిషర్లకు వార్తల వినియోగానికి ఎలా రెమ్యురేషన్ ఇస్తుందనే దానిపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. అలా చేయని పక్షంలో గూగుల్ రోజుకు అదనంగా 9 లక్షల యూరోల చొప్పున జరిమానా ఎదుర్కొవాల్సి రావొచ్చు. ఫ్రాన్స్ ప్రభుత్వ చట్టాల్ని, నిబంధనల్ని అమలు చేయడంలో గూగుల్ జాప్యం చేసిందని తద్వారా కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించింది.
గతంలో కూడా గూగుల్‌కు ఆన్ లైన్ ఆన్లైన్ ప్రకటనల విషయంలో భారీ ఫైన్ పడింది. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ వ్యాపారంలో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు 268 మిలియన్ డాలర్ జరిమానా విధించాలని తెలిపింది.