భర్త అంటే భార్యను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు.. ఆమెకు రక్షణగా ఉంటూ ఆనందంగా ఉండేలా చూసేవాడు.. కానీ ఇటీవల కొంతమంది భర్తలు ఆ స్థానానికి కలంకం తెస్తున్నారు.
భర్త అంటే భార్యకు రక్షణగా ఉంటూ.. జీవితాంతం ఆమెకు ఏ కష్టం రాకుండా సంతోషంగా ఉండేలా చూసేవాడు అంటారు. కానీ ఓ భర్త మృగం కన్నాదారుణంగా ప్రవర్తించాడు. తనను నమ్మి వచ్చిన భార్య పట్ల భర్త అత్యంత హేయంగా ప్రవర్తించాడు. భర్త స్థానంలో ఉన్న ఏ మగాడు చేయకూడని పని చేశాడు. ఆమెకు తెలియకుండానే వెలయాలిగా మార్చేశాడు. ఈ దారుణం ఫ్రాన్స్ లోని మజాన్ లో చోటు జరిగింది. విషయం తెలుసుకున్న భార్య కృంగిపోయింది.. సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఫ్రాన్స్ కి చెందిన డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు రోజూ రాత్రి తినే అన్నంలో యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్‌ను కలిపేవాడు. అన్నం తిన్న కొద్ది సేపటికి ఆమె మత్తులోకి వెళ్లిపోయేది. ఆ సమయంలో డొమినిక్ దారుణానికి తెగించేవాడు. పరాయి పురుషులను తన ఇంటికి రప్పించి భార్యపై అత్యాచారం చేయించి రికార్డు చేసేవాడు. ఇలా ఆమెకు తెలియకుండానే ఆమెను పదేళ్లపాటు వెలయాలిగా మార్చాడు. విచిత్రం ఏంటంటే ఈ విషయం బయట పడే వరకు తనపై అంతమంది అత్యాచారం చేశారని ఆమెకు తెలియదు. ఈ దారుణమైన విషయాన్ని ఫ్రాన్స్ లో ది టెలిగ్రాఫ్ అనే పత్రికలో వెల్లడించారు. భార్యపై అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో రికార్డు చేసి దాన్ని ‘ఎబ్యూసెస్’ పేరుతో యూఎస్‌బీ డ్రైవ్ లో స్టోర్ చేసి ఉంచేవాడు. ఆమెపై 26 ఏళ్ల నుంచి 73 ఏళ్ల వయసు ఉన్నవారు అత్యాచారం చేశారు. అత్యాచార నింధితుల్లో ఎక్కువగా బ్యాంకు ఉద్యోగి, లారీ డ్రైవర్, ఫైర్‌మెన్, మున్సిపల్ కౌన్సిలర్, జైలు గార్డు, ఓ జర్నలిస్ట్ సహా పలు రంగాలకు చెందినవారు ఉన్నారు.
డొమినిక్ తో బాధిత మహిళకు 50 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2011 నుంచి 2020 మధ్య డొమినిక్ ఈ దారుణాలు సాగించినట్లుగా పోలీసులు తెలిపారు. పొగతాగి, మద్యం సేవించి, పెర్ఫ్యూమ్ కొట్టుకొచ్చేవారిని డొమినిక్ అనుమతించేవాడు కాదు. ఎందుకంటే ఆ వాసనతో తన భార్యకు మెలుకువ వచ్చే అవకాశం ఉందని.. తన గుట్టు బయటపడుతుందని జాగ్రత్తలు తీసుకునేవాడు. అంతేకాదు తన భార్య వంటిపై చేతులు వేస్తే ఆమెకు స్పర్శ తెలియకుండా అథిదులను వేడి నీళ్లతో చేతులు కడుక్కుని వెళ్లాలని అతిథులకు చెప్పేవాడు. బండ్లను తన ఇంటి ముందు కాకుండా దూరంగా పార్కింగ్ చేసి రమ్మనేవాడు.
మూడు సంవత్సరాల క్రితం మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరాలతో వీడియోలు తీస్తున్నట్లు అనుమానం రావడంతో డొమినిక్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక విచారణలో అత్యాచార వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికీ డొమినిక్ తో సహా 52 మందిని అరెస్ట్ చేశారు. మరికొంత మందిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రస్తుతం యూఎస్‌బీ పోలీసుల వద్దనే ఉంది. డొమినిక్ దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత భార్య షాక్ లోకి వెళ్లిపోయింది. తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.