మన కవులు, పురాణాలు, సాహిత్యం తల్లి ప్రేమ గురించి ఎంతో గొప్పగా వర్ణించాయి. అవును మరి బిడ్డకు జన్మనివ్వడం అంటే.. ఓ రకంగా పునర్జన్మ వంటిదే. తన ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని తెలిసినా.. సరే స్త్రీ దాన్ని పట్టించుకోకుండా.. బిడ్డకు జన్మన్వివడానికి సిద్ధపడుతుంది. ఇక తల్లి ప్రేమ గురించి ఎంత వర్ణించినా తక్కువే. అయితే తల్లి ప్రేమ పైకి కనిపిస్తుంది.. కానీ తండ్రి మాత్రం.. బిడ్డలపై తన ప్రేమను, అనురాగాన్ని గుండె లోతుల్లోనే దాచుకుంటాడు. తల్లి బిడ్డకు జన్మనిస్తే.. తండ్రి.. ఆ బిడ్డకు జీవితాన్ని ఇస్తాడు. తల్లి నవమోసాలు మోస్తే.. తండ్రి.. జీవిత కాలం.. బిడ్డల బరువు, బాధ్యతలను తన భుజాలపై మోస్తాడు. బిడ్డల భవిష్యత్తే లోకంగా బతుకుతాడు. పిల్లల కలలు తీర్చడం కోసం ఎంత కష్టమైన పడతాడు. పైకి గంభీరంగా కనిపించినా.. ఆ గుండెల్లో బిడ్డలపై అంతులేని ప్రేమ దాగి ఉంటుంది.
అయితే కాలంతో పాటు తండ్రి పాత్ర కూడా మారుతోంది. మరీ ముఖ్యంగా ఈ కాలంలో తండ్రే పిల్లలకు మంచి స్నేహితుడు. ఈ కాలం తండ్రి బిడ్డలపై తన ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయడానికి మోహమాటపడటం లేదు. వారితో కలిసి ఆడుతున్నాడు.. అల్లరి చేస్తున్నాడు. పిల్లలు కూడా తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని తండ్రితో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఆడపిల్లలకయితే.. తండ్రే హీరో, బెస్ట్‌ఫ్రెండ్. మరి మనకు జీవితాన్ని ప్రసాదించిన తండ్రిపై ప్రేమను వెల్లడించేందుకు.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. మరి ఈ ఫాదర్స్ డే ఎలా వచ్చింది.. దీని చరిత్ర ఏంటో తెలియాలంటే.. ఇది చదవండి.
ఇది కూడా చదవండి: Ongole: హర్షిత పెళ్లై మూడు నెలలే అయింది.. అంతలోనే!
ప్రతి ఏటా ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు ఫాదర్స్ డే జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మదర్స్ డే ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు.
ఇది కూడా చదవండి: Singer Vagdevi: మా అమ్మే నన్ను సింగర్ ని చేసింది: తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి
ఆ తరువాత అలా అలా ఈ నాన్నల దినోత్సవానికు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్‌లో వచ్చే మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి. మరి ఈ ఫాదర్స్ డే రోజున మీ తండ్రికి థాంక్స్ చెబుతూ.. ఆయనకొక చిరు కానుకు ఇవ్వండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Indraja: ఇంద్రజ షాకింగ్ కామెంట్స్.. రోజా వస్తే.. నేను ఉండను.. వెళ్లిపోతాను!