ప్రతిమనిషి జీవితంలో ఏదో కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటుంటారు. కానీ ఎదుగుతున్న కొద్దీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కలలు కనుమరుగై.. అనుకోని రంగంలో స్థిరపడాల్సి వస్తుంది. మనసుకు నచ్చకపోయినా కుటుంభం కోసమో, సమాజం కోసమో ఏదో ఒక ఉద్యగంలో స్థిరపడతారు. ఇప్పుడు మనం చదవబోయే కథనం కూడా ఆ కోవకు చెందిందే చిన్నప్పటినుంచి పోలీస్ కావాలని కలలు కన్న యువతి చివరికి పోర్న్ స్టార్ గా మారింది. ప్రస్తుతం ఆమె స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
యూరప్ కి చెందిన 25 ఏళ్ళ మోర్గాన్ డోయ్న్ కి చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే ఇష్టం. యూనివర్శిటీలో కెమిస్టీ, ఫోరెన్సిక్ చదివింది. పోలీస్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ అవ్వాలన్నది ఆమె కల. ఓవైపు చదువుకుంటూ… మరోవైపు వెయిట్రెస్‌గా పనిచేస్తూ… డబ్బు సంపాదించేది. రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న ఓ సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. హోట్‌లలో వెయిట్రస్‌గా పని చేసే ఆమె రెండేళ్లు గడిచేసరికి కోటీశ్వరురాలయ్యింది. నెలకు ఏకంగా లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఇప్పుడు ఐదు బెడ్‌రూమ్‌ల సొంత ఇల్లు ఉంది. ఫ్లాషీ రెడ్ మస్తాంగ్ కారు ఉంది. దాని ఖరీదు రూ.74 లక్షలు.
ఈ డబ్బంతా ఆమెకు పోలీస్ అవ్వడం వల్ల రాలేదు. తన బెడ్‌రూంలో తీసిన ఎక్స్‌పోజింగ్ ఫొటోలు అమ్మకోవడం ద్వారా వచ్చింది. కరోనా మహమ్మారి ప్రపంచం మీదకు అడుగుపెట్టిన తొలి రోజుల్లో.. హెటల్‌లో పని చేస్తున్న ఉద్యోగం పోవడంతో.. బతుకుదెరువు కోసం అడల్ట్ సైట్ అయిన ఓన్లీఫాన్స్‌లో చేరిన మోర్గాన్… వారం వారం తన సంపాదనను పెంచుకుంటూ పోయింది. ఇప్పుడామె నెలకు రూ.40 లక్షల దాకా సంపాదిస్తోంది
సాధారణంగా అడల్ట్ సైట్లలో చేరిన వారు వీలైనంత ఎక్కువగా స్కిన్ షో చేస్తే డబ్బు వస్తుంది అనుకుంటారు. కానీ మోర్గాన్ మరోలా ఆలోచించింది. కాస్‌ప్లేయర్లు వేసుకునే డ్రెస్సులతో ఫొటోలు దిగి… వాటిని అమ్ముకోవాలి అనుకుంది. అది ఆమెకు కలిసొచ్చింది. హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు, యానిమేషన్ కార్టూన్లలో కేరక్టర్లు వేసుకునే దుస్తులు వేసుకొని ఆ ఫొటోలను ఓన్లీఫాన్స్‌లో పోస్ట్ చేస్తోంది మోర్గాన్.అవి నెటిజనులకు విపరీతంగా నచ్చడంతో.. ఆమె దశ తిరిగింది. లక్షల సంపాదన ఆర్జిస్తోంది.
ఈ సందర్భంగా మోర్గాన్ డోయ్న్ మాట్లాడుతూ..”ఈ కాస్‌ప్లే కాస్ట్యూమ్స్ వేసుకోవడం కొన్ని నెలల కిందటే మొదలుపెట్టాను. ఎందుకో అవి నాకు నచ్చాయి. నా ఫాన్స్‌కి కూడా నచ్చాయి” అని ఆమె తెలిపింది.”నేను ఈ సైట్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేయడం ప్రారంభించినప్పుడు కొందరు నన్ను స్పైడర్ మేన్ లాగా డ్రెస్ వేసుకొని కనిపించమన్నారు. మరో వ్యక్తి నెత్తిపై పాలు పోసుకుంటూ కనిపించమన్నారు. అలా ఎందుకు అడిగారో ఏమో. చిత్రమేంటంటే.. నేను ఫిబ్రవరిలో టిక్‌టాక్‌లో చేరాను. కానీ ఇప్పటికే నాకు 5 లక్షల మంది దాకా ఫాలోవర్స్ ఉన్నారు” అని మోర్గాన్ తెలిపింది.
25 ఏళ్ల ఈ బ్యూటీ.. ఓన్లీఫాన్స్ తన జీవితాన్ని మార్చేసిందని చెబుతోంది.ప్రస్తుతం తాను స్థిరపడిన ఈ రంగం తనకు ఎంతో బాగుందని అంటోంది. మరి యూనివర్శిటీలో సంపాదించిన డిగ్రీ సంగతేంటి అంటే… ఏమో ఎప్పుడైనా పోలీస్ అవుతానేమో అని నవ్వేస్తోంది. మోర్గాన్ డోయ్న్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.