ఇంటర్వ్యూలో భావోద్వేగం…
నాసా తమను బతికించింది…
అమెరికాలోని మంచితనం ఇదే!..
‘ఎలాన్ మస్క్’ కంటతడి వీడియో వైరల్!..
స్పేస్ ఎక్స్ ను మూసే సమయంలో సంస్థలో కనీసం పరికరాలు కొనే స్తోమత లేకపోయినా 150 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్ ను నాసా ఇచ్చిందన్నారు ఎలాన్ మస్క్ . ఆ క్షణాన ఏం చెప్పాలో తెలియలేదని, నాసా తమను కాపాడిందని అన్నారు. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకొని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దానికి సంబంధించిన వీడియోను ‘టెస్లా ఓనర్స్ ఆఫ్ సిలికాన్‌వ్యాలీ’ గ్రూప్ ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దాదాపు 2.2 లక్షల మంది దానిని వీక్షించారు. ఇప్పుడు వైరల్ అయింది.
తాను నాసాను ఎల్లప్పుడూ ఇష్టపడుతూనే ఉంటానని మస్క్ చెప్పారు. మంచి జరిగేందుకు పోరాడిన ప్రభుత్వంలోని అధికారులకు కృతజ్ఞతలు అని అన్నారు. వేరే వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. అమెరికాలోని మంచితనం ఇదేనన్నారు. ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్ ఎక్స్ లతో సక్సెస్ కొట్టిన కోటీశ్వరుడు. అయితే, తన ఎదుగుదల వెనక ఎంతో కష్టం ఉందని అంటున్నారాయన.
ఒకానొక దశలో స్పేస్ ఎక్స్ సంస్థను మూసేసుకోవాల్సి వచ్చినంత పనైందన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాసా ఒప్పందం గురించి చెబుతూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి సామగ్రిని తీసుకెళ్లాల్సిన భారీ కాంట్రాక్టును స్పేస్ ఎక్స్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ 1.6 బిలియన్ డాలర్లు. అప్పటికే తీవ్ర నిరాశలో కూరుకుపోయిన మస్క్‌కు ఇది పెద్ద ఊరట కలిగించింది. ఈ వార్తను ఫోన్ ద్వారా తెలుసుకున్న ఆయన వెంటనే ‘ఐ లయ్ యూ గాయ్స్’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇది 2008 క్రిస్మస్కు రెండు రోజుల ముందు జరిగిన ఘటన. ఈ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ స్వయంగా వివరించారు. నాసా తమని కాపాడిందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.ఓ దశలో స్పేస్ ఎక్స్‌ను దాదాపు మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చాయట! ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకొని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
.@nasa called @elonmusk and told them that they had won the $1.5B contract. @elonmusk response “I love you guys.” pic.twitter.com/iKKc4UVvvV
— Tesla Owners of Silicon Valley (@teslaownersSV) August 4, 2021