చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు అని నిరూపిస్తున్నారు బ్రెజిలియన్స్. తప్పు చేస్తే సామాన్యుడైనా దేశ అధ్యక్షుడైనా శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు. మాటలకి మాత్రమే పరిమితం కాకుండా… అధ్యక్షుడిపై కేసు నమోదు చేశారు. సాధారణంగా అధికారంలోకి ఉన్న బడా నేతలకు పలుకుబడి ఉన్న నాయకులకు పెద్దగా వర్తించదు. ఎందుకుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎవరూ పెద్దగా సాహసించరు. బ్రెజిల్ లోని మారన్ హవో రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం వందమందికిపైగా పాల్గొనే సమావేశాల జరపకూడదని నిషేధం ఉంది. వీటితో పాటు మాస్క్ ధరించని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మారన్ హవో రాజధాని సావో లూయిస్ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాస్క్ కూడా ధరించలేదు.
ఆ ప్రాంతంలో ఉన్న కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దీనిపై మారన్ హవో రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో స్పందించారు. ఆ ప్రాంతంలో ఉన్న కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు గాను అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. జరిమానా వ్యవహారంపై బొల్సనారో కార్యాలయం 15 రోజుల్లోగా అప్పీలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎంత ఫైన్ చెల్లించాలన్నది నిర్ణయిస్తారు.