సాధారణంగా దొంగలు డబ్బు, నగలు, విలువైన వస్తువులను దోచుకెళ్లి పోవడం మనకు తెలిసిందే. కానీ అక్కడ మాత్రం ఓ దొంగ ఓ యువతి ఫోన్ కొట్టేయడంతో పాటు ఆమె మనసును కూడా దొంగిలించి ప్రేమికుడిగి మారిపోయాడు.
ప్రేమకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. ఎవరి జీవితంలోనైనా వయసుతో సంబంధం లేకుండా ప్రేమ చిగురిస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ పరిచయాలతో ఏకంగా దేశాలు దాటిమరి ఎగిరిపోతున్నారు ప్రేమ పక్షులు. ఇటీవల పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం పాక్ మహిళ ఇండియాకు రావడం, భారత్ కు చెందిన మహిళ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం పాక్ కు వెళ్లడం పెళ్లిల్లు చేసుకున్న సంఘటనలు మనకు తెలిసినవే. ఇదిలా ఉంటే ఓ యువతి అసలు ఊహకందని రీతిలో ఓ దొంగతో ప్రేమలో పడింది. వారిద్దరు గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. ఇది చూసిన నెటిజన్లు అమ్మాయిలు ఇలా కూడా ప్రేమలో పడతారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రేమ ఏ క్షణాన ఎలా, ఎవరిపై పుడుతుందో తెలియదు. కొన్ని సందర్భాల్లో ఈ అమ్మాయి ఈ అబ్బాయికి ఎలా పడింది, లేదా ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఎలా లవ్ లో పడ్డాడ్రా బాబు అంటూ ఆశ్యర్యపోయే సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనే బ్రెజిల్ లో చోటుచేసుకుంది. ఓ అందమైన అమ్మాయి తన ఫోన్ దొంగిలించిన యువకుడితో ప్రేమలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఇమాన్యులా అనే యువతి బ్రెజిల్ లోనివసిస్తుంది. ఓ రోజు ఆమె బయటికి వెళ్లినప్పుడు అనుకోకుండా ఆమె ఫోన్ ను జాకర్ అనే యువకుడు కొట్టేసాడు.
కాగా ఆ ఫోన్ లో ఆ యువతి ఫొటో చూసి ఆమె అందానికి ముగ్దుడయ్యాడు. ఆమెపై ఇష్టం పెంచుకుని ఫోన్ ను ఆమెకు తిరిగిచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. గత రెండేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్నట్లు ఓ మీడియాకు వెళ్లడించారు. ఆమెను విడిచి ఉండలేక పోతున్నానని జాకర్ తెలిపాడు. రిపోర్టర్ జాకర్ తో మాట్లాడుతూ.. మీరు ఆమె ఫోన్ దొంగిలించి ఆ తర్వాత ఆమె మనసును దొంగిలించారని అడగగా.. నిజమే అంటూ నవ్వులు చిందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Calma Milton , nossa sociedade é muito sadia mentalmente ainda 🙃 pic.twitter.com/PkaMQkLK54
— Bender B. Rodríguez 🇲🇽 (@BenderEyes) July 21, 2023