ప్రతి ఒక్క పిల్లవాడిలో ఎదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అయితే సమయం వచ్చినప్పుడు బయట పడుతుంది. అలా ఎంతో మంది చిన్నారులు.. తమ అసామాన్య ప్రతిభతో అందరితో ఔరా అనిపించుకుంటున్నారు. అలానే ఓ 12 ఏళ్ల బాలుడు కూడా తనదైన ప్రతిభతో ఔరా అనిపిస్తున్నాడు.
ప్రతి ఒక్క పిల్లవాడిలో ఎదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అయితే సమయం వచ్చినప్పుడు బయట పడుతుంది. అలా ఎంతో మంది చిన్నారులు.. తమ అసామాన్య ప్రతిభతో అందరితో ఔరా అనిపించుకుంటున్నారు. చిన్న వయస్సలోనే అనేక సంచలన సృష్టిస్తూ చరిత్రలో నిలిచిపోతున్నారు. తాజాగా 12 ఏళ్ల బాలుడు కూడా అందరిని తనవైపు తిప్పుకునేలా చేశాడు. కఠోరమైన కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ ను సాధించాడు ఈ బాలుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బుల్లి హీరో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బ్రెజిల్ దేశానికి చెందిన కాజిన్ యో నెటో అనే 12 ఏళ్ల బాలుడు సిక్స్ ప్యాక్ ను సంపాదించాడు. ఇతడి అసలు పేరు కార్లోస్ అగస్టో పిటాంగ నెటో. ఆయన తండ్రి వర్కౌట్లు చేయడం చూసి జిమ్ పై ఆసక్తి పెంచుకున్నాడు. తొలుత పుట్ బాల్ ఆటపై విపరీతమైన మోజు ఉండేది. అయితే వేసవి సెలవుల్లో కార్లోస్ తండ్రి జిమ్ కు తీసుకెళ్లే వాడు. ఆ సమయంలో జిమ్ పై అతడి ఆసక్తి పెరిగింది. అలానే సమ్మర్ సెలవులోనే జిమ్ లో శిక్షణ తీసుకున్నాడు.
కేవలం 15 రోజుల్లోనే ఆ బాలుడు కసరత్తులు చేయడం ప్రారంభించాడు. ఆ వయసులోని మిగతా పిల్లలకు సాధ్యాం కానీ వర్కౌట్లను కాజిన్ యో అవలీలగా చేసేవాడు. దీంతో అతడి తల్లిదండ్రులుకూ ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఈక్రమంలో రోజూ ఉ దయం 5.30 కల్లా నిద్ర లేస్తాడు. ఆ వెంటనే సుమారు 5 కి.మీ దూరం పరుగు తీస్తాడు. ఆ తరువాత కొన్ని సిటప్స్ తీస్తాడు. స్కూల్ ఉన్నా లేకపోయినా ఈ కండల వీరుడి దినచర్య రోజూ ఇలానే ఉంటుంది. సాయంత్ర స్కూల్ నుంచి రాగానే హోం వర్క్ పూర్తి చేసుకుని జిమ్ కి వెళ్తాడు. దాదాపు 2.5 గంటల సమయం జిమ్ లోనే గడిపేస్తాడు.
కాజిన్ యో ఒక ప్రణాళిక ప్రకారం జిమ్ చేస్తున్నాడు. దీంతో అతడి శరీర ఆకృతి మాత్రమే మారింది. బరువు, ఎత్తు, పెరుగుదల సాధారణ పిల్లల్లాగే ఉంది. కాజిన్ యో ఫిట్ నెస్ పై దృష్టి సారించిన ప్రారంభంలో 1.34 మీటర్లు ఎత్తు ఉండేవాడు. ఇప్పుడు 1.47 మీటర్ల ఎత్తు పెరిగాడు. ప్రారంభంలో 33 కేజీల బరువుండగా.. ప్రస్తుతం 38 కేజీలకు చేరుకున్నాడు. కాజిన్ యో కసరత్తులు సోషల్ మీడియాలో చూసిన వారంతా అతను తప్పకుండా బ్రెజిలియన్ క్రాస్ ఫిట్ అవుతాడని కీర్తిస్తున్నారు. మరి.. ఈ బాల కండల వీరుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి