ఇటీవల వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు చూస్తుంటే.. ప్రయాణికులకు విమానాల్లో ప్రయాణం చేయడం సురక్షితమేనా అన్న అనుమానాలకు కలుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో పలు కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల వరుస విమాన ప్రమాద ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టెక్నికల్ ఇబ్బందులు, పక్షులు ఢీ కొట్టడం.. కొన్నిసార్లు విమానంలో ప్రయాణికులు చేసే తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఓ విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుంది.. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరగడంతో ఎక్కడా సురక్షితం లేదని వాపోతున్నారు ప్రయాణికులు. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే పలు కారణాల వల్ల విమానాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి.. ఆ సమయంలో పైలట్స్ సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుతున్నారు. కొన్నిసమయాల్లో ప్రమాదంలో ఎంతోమంది మరణిస్తున్నారు. బ్రెజిల్ మీదుగా ప్రయాణిస్తున్న ఓ విమానం మధ్యలో అనుకోని విధంగా ఎమర్జెన్సీ డోర్ పగిలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయడంతో వణికిపోయారు. సావో లూయిస్ నుండి సాల్వడార్‌కు విమానం బయలు దేరిన 30 నిమిషాల్లోనే ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటన మొత్తం కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ విమానంలో బ్రెజిల్ కి చెందిన ప్రముఖ గాయకుడు, పాటల రచయిత టియరీ తన సహచరులతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నాడు. గాలి క్యాబిన్ లోకి దూసుకుపోతున్నపుడు ప్రయాణికుల పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఈ ఘటన గురించి బ్రేకింగ్ ఏవియేషన్ న్యూస్ & వీడియోస్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ‘బ్రెజిల్ గాయకుడు, పాటల రచయిత టియరీ ప్రయాణిస్తున్న విమానంలో కార్గో డోర్ తెరుచుకున్న తర్వాత సావో లూయిస్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడం జరిగింది’ అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో భీకరమైన గాలి విమాన ప్రయాణికులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
The aircraft of Brazilian singer and songwriter Tierry safely lands at São Luís Airport after the cargo door opens in flight. pic.twitter.com/VIx79ABtdX
— Breaking Aviation News & Videos (@aviationbrk) June 14, 2023