భారీ భూకంపంతో కరేబియన్ దేశం ‘హైతీ‘ ఘోరంగా వణికిపోయింది. శనివారం సంభవించిన భూకంపం దాటికి 300 మందికి పైగా మరణించారు. దాదాపు 1800 మందికిపైగా గాయపడ్డారు. హైతీలో చర్చిలు, హోటళ్లు సహా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి. ”దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది”అని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రజలు ఎక్కువగా జీవించే పోర్టౌ ప్రిన్స్‌కు ఇది 150 కి.మీ. దూరంలో ఉందని వివరించింది. భూకంప ప్రభావం దాదాపు అన్ని కరిబియన్ దీవుల్లోనూ కనిపించింది. భూకంపం వచ్చిన తర్వాత దాదాపు ఆరు సార్లు భూమి కంపించినట్లు తెలుస్తోంది. ”చాలా ఇళ్లు శిథిలం అయ్యాయి. ప్రజలు చనిపోయారు. కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు”అని భూకంప కేంద్రానికి సమీపంలో నివసించే వారు తెలిపారు. సహాయ కార్యక్రమాల కొనసాగుస్తున్నట్లు ప్రధానమమంత్రి ఏరియెల్ హెన్రీ తెలిపారు. స్థానికులు సైతం సహాయకార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్పొంటున్నారు.
“శిథిలాల కింద నుంచి వీలైనంత ఎక్కువ మందిని ప్రాణాలతో బయటికి తీయాలని ప్రయత్నిస్తున్నాం. స్థానిక ఆస్పత్రులు, ముఖ్యంగా లెకాయ్‌లోని ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయినట్లు తెలిసింది” అన్నారు. తర్వాత ఏరియల్ సర్వే ద్వారా కేయెస్‌లో పరిస్థితిని పరిశీలించినట్లు హెన్రీ తెలిపారు.
హైతీకి సాయం చేసేందుకు తక్షణం చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. నష్టాన్ని అంచనా కోసం, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ఇచ్చేందుకు యూఎస్ఏఐడీ కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటికే హైతీ ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారని, ఇప్పుడు ఈ భూకంపం విధ్వంసం సృష్టించడం విచారకరమని బైడెన్ అన్నారు.
కరేబియన్ ప్రజలకు భూకంపాలు కొత్తేంకాదు.. హైతీలో 2010లో వచ్చిన భూకంపంలో 2 లక్షల మందికి పైగా మరణించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం కలిగింది.
Haiti earthquake !
Prayers with Haiti people. The videos coming out are scary. #Haiti #haitiearthquake. pic.twitter.com/NO652A2r0t
— Bombur. (@Junnyslife) August 15, 2021