ఇటీవల పలు దేశాల్లో వరుస భూకంపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
గత కొంత కాలంగా ప్రపంచ దేశాల్లో వరుస భూకంపాలు తీవ్ర కలకలం సృస్టిస్తున్నాయి. భూకంప ధాటికి బారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. భూకంప పేరు వింటేనే వెన్నుల్లో వణుకుపుడుతుంది. ఈ ఏడాది ఫ్రిబవరిలో టర్కీ, సిరియా లో సంభవించిన భూకంప బీభత్సాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ భూకంప ధాటికి దాదాపు 50 వేల మంది చనిపోగా.. కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇటీవల భారత్ లో పలుమార్లు భూకంపం తీవ్ర అలజడి సృష్టించింది. ఇక అండమాన్ దీవుల్లో తరుచూ భూకంపాలు భయాందోళన గురి చేస్తున్నాయి. తాజాగా అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
అండమాన్ నికోబార్ దీవుల్లో ఇటీవల పలుమార్లు భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూమి కంపించింది. బుదవారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.0 గా నమోదు అయినట్లు తెలిపారు. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదని ఎన్‌సిఎస్ తెలిపింది. కాగా, గడిచిన 5 రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లో రెండో సారి భూకంపం సంభవించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జులై 29వ తేదీ అర్థరాత్రి 12.53 గంటల ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లేయిర్ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో సుమారు 69 కిలోమీటర్ల మేర కదలికలు జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. పోర్ట్ బ్లెయిర్ కి 126 కిలో మీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ఇప్పటికే భూకంపం పేరు చెబితేనే భయపడిపోతున్న ప్రజలు.. ఐదు రోజుల్లోనే రెండు సార్లు భూకంపం రావడంతో ఇక్కడ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
Earthquake of Magnitude:5.0, Occurred on 02-08-2023, 05:40:11 IST, Lat: 9.32 & Long: 94.03, Depth: 10 Km ,Location: Nicobar islands, for more information Download the BhooKamp App https://t.co/pVTorSRG6T @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 @DDNewslive pic.twitter.com/kEqkWxtouk
— National Center for Seismology (@NCS_Earthquake) August 2, 2023