భారీ భూకంపంతో కరేబియన్ దేశం ‘హైతీ‘ ఘోరంగా వణికిపోయింది. శనివారం సంభవించిన భూకంపం దాటికి 300 మందికి పైగా మరణించారు. దాదాపు 1800 మందికిపైగా గాయపడ్డారు. హైతీలో చర్చిలు, హోటళ్లు సహా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి. ”దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది”అని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ […]