వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నేపాల్ ప్రమాద ఘటనలో 68 మృత్యవాత పడ్డ సంగతి మరవక ముందే, దుబాయ్ నుంచి న్యూజిలాండ్ బయలుదేరిన విమానం 13 గంటల అనంతరం మళ్ళీ దుబాయ్ లో ల్యాండ్ అయ్యింది. తాజాగా, అదే కోవకు చెందిన వార్త మరొకటి అందుతోంది. ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
డిజిసిఎ వివరాల ప్రకారం.. బి737- 800 ఎయిర్ ఇండియా విమానం 184 మంది ప్రయాణికులతో అబుదాబి నుండి కోజికోడ్(కేరళ)కు బయలుదేరింది. టేకాఫ్ అయి 1000 అడుగుల ఎత్తులోకి వెళ్లగానే ఇంజన్‌లో మంటలు రావడం గమనించిన పైలట్.. విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి అబుదాబి విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని డిజిసిఎ తెలిపింది. ఈ ప్రమాదం సాంకేతిక లోపంతోనే ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు.
BREAKING: #BNNIndia Reports.
According to sources, an Air India Express flight from Abu Dhabi to Calicut had to return to the airport in Abu Dhabi because one of the engines had caught fire.#Airturnback #AirIndia #AbuDhabi #DGCA pic.twitter.com/JhiAjP7dy8
— Gurbaksh Singh Chahal (@gchahal) February 3, 2023