మీరు నిరుద్యోగులా..? ఎయిర్ పోర్ట్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారా..? అయితే అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విమానాలు రద్దవడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాసేపట్లో ప్రయాణం అనగా హఠాత్తుగా ఫ్లైట్స్ రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవలే విమానంలో ఓ మహిళపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన అందరికి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే తాజాగా విమానంలో మరో ఘటన చోటుచేసుకుంది. విమానంలో సిగరేట్ కాల్చవద్దనందుకు ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. అతడు ఎంత చెప్పిన వినకపోవడంతో సిబ్బంది.. అదిరిపోయే శిక్ష విధించారు.
గోల్డ్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. భారతదేశంలో బంగారానికి మహిళలు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇటీవల డబ్బు కోసం కక్కుర్తి పడుతూ కొంతమంది విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. రక రకాల పద్దతుల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ ఆఫీసర్స్ కి పట్టుబడుతున్నారు.
ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలను మిగుల్చుతున్నాయి. ఇటీవల నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదం 69 మంది ప్రాణాలు కోల్పోయారు. టెకాఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
టాటా కంపెనీ అంటేనే ఒక చరిత్ర. చరిత్ర సృష్టించాలన్నా టాటానే, ఆ చరిత్రను తిరగరాయాలన్నా టాటానే. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 500 విమానాలను ఆర్డర్ చేసింది టాటా. విమానయాన చరిత్రలోనే ఇదొక సంచలనం. టాటా గ్రూప్ సంస్థకు చెందిన ఎయిర్ ఇండియా భారీ డీల్ తో భారత్ లో 500 విమానాలు అడుగుపెట్టనున్నాయి. టాటా 500 విమానాలను ఎందుకు ఆర్డర్ చేసింది?
వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నేపాల్ ప్రమాద ఘటనలో 68 మృత్యవాత పడ్డ సంగతి మరవక ముందే, దుబాయ్ నుంచి న్యూజిలాండ్ బయలుదేరిన విమానం 13 గంటల అనంతరం మళ్ళీ దుబాయ్ లో ల్యాండ్ అయ్యింది. తాజాగా, అదే కోవకు చెందిన వార్త మరొకటి అందుతోంది. ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. డిజిసిఎ వివరాల […]
ఖుష్బు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఖుష్బు. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అభిమానులు ఆమె మీద ప్రేమతో ఏకంగా గుడి కట్టారు. ఆ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఖుష్బు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మంచి పాత్రల్లో నటిస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. అటు రాజకీయాల్లో కూడా […]
ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిసిజిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ లో ఎయిరిండియాలో ప్రయాణిస్తున్న మహిళపై శంకర్ మిశ్రా అనే ప్రయాణీకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై చర్యలు చేపట్టిన డిసిజిఎ ఈ భారీ జరిమానాను విధించింది.అదేవిధంగా ఈ ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ […]
‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..’ మిర్చీ మూవీలో ‘ప్రభాస్’ చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా! ఈ సాహసమే చేశాడు ఓ యువకుడు. విమానం ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అందుకు ఆమె చిరునవ్వులు చిందిస్తూ అంగీకరించడం గమనార్హం. ఈ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకుంటే.. వీరి ప్రేమలో ఒక ట్విస్ట్ ఉంది. వివరాల్లోకి వెళ్తే.. […]