నాలుగేళ్ళ వయసులో టీవీ చూడడం, ఆట, పాటలు తప్పితే వేరే లోకం తెలియదు పిల్లలకి. కానీ నాలుగేళ్ల వయసులో అరుదైన రికార్డుని సాధించాడో బాబు. ఆ సినిమాలో సుహాస్ చేయలేనటువంటి పనిని ఈ కుర్రాడు నాలుగేళ్ల వయసులో చాలా అవలీలగా చేసేశాడు. ఇంతకే ఆ పని ఏంటి? ఆ వివరాలు మీ కోసం.
ఆ సినిమాలో సుహాస్ కూడా చేయలేకపోయాడు ఆ పని. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాబు మాత్రం నాలుగేళ్లకే అరుదైన రికార్డు సృష్టించాడు. నాలుగేళ్ల వయసంటే యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్స్ చూడడం తప్ప ఇంకేమీ చేసే అవకాశం ఉండదు. చదువుకోరా బాబు, చదువుకోవే తల్లి అంటే.. ‘ఉటూబ్ లో వీడియోలు చూస్తాం, షార్టులు, ప్యాంట్లు చూస్తాం’ అని ముద్దు ముద్దు మాటలు మాట్లాడతారు. పిల్లలతో పుస్తకం తెరిపించాలంటే అదొక పెద్ద ఘట్టం. పిల్లలతో బుక్ వైపు లుక్ వేయించడమే కష్టం. అలాంటిది ఒక నాలుగేళ్ల బాబు ఏకంగా పుస్తకం రాసేశాడు. రాయడమేంటి ఏకంగా ఆ పుస్తకాన్ని ప్రచురించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేసుకున్నాడు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఘనత సాధించిన బాబు ఎవరు? ఆ బాబు ఏం చేశాడు?
రైటర్ పద్మభూషణ్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరోకి రైటర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. కథ రాసి దాన్ని ప్రచురిస్తాడు. కానీ కాపీలు అమ్ముడవ్వవు. కానీ మనం చెప్పుకోబోయే ఈ బుల్లి రైటర్ పద్మభూషణ్ జీవితం అలా కాదు. ప్రచురించిన మొదటి కథే సక్సెస్ అయ్యింది. వెయ్యి కాపీల వరకూ అమ్ముడైపోయాయి. అంతగా అమ్ముడైపోవడానికి అందులో అంత డెప్త్ ఏముంది అంటే? స్నేహం గురించిన కథ రాశాడు. ఏనుగుకి, ఎలుగుబంటికి మధ్య స్నేహం మీద ఒక కథ రాసి దాన్ని ప్రచురించాడు. కథను ప్రచురించి మార్కెట్లో పెట్టగానే.. వెయ్యి కాపీల వరకూ అమ్ముడైంది. దీంతో ఈ బుల్లి రైటర్ పద్మభూషణ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుధాబిలో ఉండే సయీద్ రషీద్ అనే బాబు వయసు నాలుగేళ్లు. ఈ వయసులో పెద్ద పనే పెట్టుకున్నాడు. ఒక కథ రాసి ఆ పుస్తకాన్ని ప్రచురించాడు. అతి చిన్న వయసులోనే సయీద్ రషీద్ రికార్డులకెక్కినట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అధికారులు ప్రకటించారు. సయీద్ ఈ పుస్తకం రాయడానికి ఎనిమిదేళ్ల వయసున్న తన అక్క అయిధాబీ స్ఫూర్తిగా నిలిచింది. సయీద్ బుక్ రాసి ప్రచురించి రికార్డులకెక్కడం ఒక ఎత్తు ఐతే.. ఆమె అక్క అయిధాబీ ఒక ప్రచురణ సంస్థను నడుపుతోంది. ఇది మరొక రికార్డు. కుటుంబం మొత్తం పుస్తకాలంటే ఇష్టం కావడంతో సయీద్ ఈ అరుదైన రికార్డును సాధించగలిగాడు. మొత్తం మీద ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా పుస్తకాలు తిని బతికేస్తున్నారన్నమాట. ఆ విధంగా మొదటి ప్రయత్నంలో రైటర్ పద్మభూషణ్ సినిమాలో హీరో ఫెయిలైనా.. ఈ బుడతడు మాత్రం కథ ప్రచురించి సక్సెస్ అయ్యాడు. మరి ఈ బుల్లి రైటర్ పద్మభూషణ్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.