మీరు కాస్ట్లీ కార్లు చూసుంటారు, బైక్ లు చూసుంటారు, ఖరీదైన దుస్తులు కూడా చూసుంటారు. కానీ, కాస్ట్లీ ఐస్ క్రీమ్ చూశారా? లక్షల విలువజేసే ఐస్ క్రీమ్ ఒక టుందని మీకు తెలుసా? అవునండి.. ఒక ఐస్ క్రీమ్ ధరతో మీరు కారు కొనేయచ్చు. మరి.. దాని వివరాలేంటి? ఎందుంకత ప్రత్యేకమో? చూసేయండి.
నాలుగేళ్ళ వయసులో టీవీ చూడడం, ఆట, పాటలు తప్పితే వేరే లోకం తెలియదు పిల్లలకి. కానీ నాలుగేళ్ల వయసులో అరుదైన రికార్డుని సాధించాడో బాబు. ఆ సినిమాలో సుహాస్ చేయలేనటువంటి పనిని ఈ కుర్రాడు నాలుగేళ్ల వయసులో చాలా అవలీలగా చేసేశాడు. ఇంతకే ఆ పని ఏంటి? ఆ వివరాలు మీ కోసం.
క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారులకు కోట్లు తెచ్చిపెడుతూ.. క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదాన్ని అందించే ఐపీఎల్‌కు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఐపీఎల్‌కు స్థానం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2022 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. గతేడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ను ఏకంగా 1,01,566 మంది […]
ఎవరికైనా తమ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. తమ పేరు ఉన్న వ్యక్తులు ఎదురైతే లోపల ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. బ్రో నీది, నాది ఒకే పేరు అని చెప్పుకుని సంబరపడిపోతుంటారు. అయితే జీవితంలో ఒకే పేరు గల వ్యక్తులు ఒకరిద్దరు ఎదురవుతుంటారు. కానీ వంద మందికి పైగా ఒకే పేరున్న వ్యక్తులు ఎక్కడైనా కలవడం చూశారా? మన పేరు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ అందరూ కలవడం అనేది అసాధ్యం. […]
సాధారణంగా ఏనుగు చెవులు చాలా పెద్దగా చాటంత ఉంటాయి. అందుకే ఎవరికైనా కొంచెం పెద్ద చెవులు ఉంటే వామ్మో ఏనుగు చెవులురా వీడివి అంటుంటారు. అయితే కొన్ని జంతువులకు కూడా చెవులు పెద్దవిగా ఉంటాయి. కానీ ఓ చిన్న మేక పిల్లకు చెవులు చాంతాడంత ఉండటం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఒకదశలో ఈ మేక పిల్ల పుట్టినప్పుడు దానికంటే దాని చెవులే ఎక్కువ పొడవున్నాయట.. అందుకే ఈ మేక పిల్ల త్వరలో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతుంది. […]
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ ముగింపునకు వచ్చింది. ఇప్పటి వరకు హోరా హోరీగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కి చేరుకున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ఐపీఎల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్ల లోగోలతో కూడిన అతిపెద్ద జెర్సీని రూపొందించడం ద్వారా ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ జెర్సీని గా భారత క్రికెట్ బోర్డుని గిన్నిస్ బుక్ రికార్డు వరించింది. ఐపీఎల్ […]