ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఆదరణ చాలా ఉంది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రారాజు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు టెస్లా. ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమైయ్యాయి. ప్రపంచం మొత్తం మీద విద్యుత్ వాహన మార్కెట్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్న టెస్లా, ఏకఛత్రాధిపత్యంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లను ఏలుతోంది. అయితే ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా పేరొందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు చాలా వరకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ వాహనాల తయారీ కంపెనీలు కూడా ఈవీ వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
2022 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెస్ తన కారును కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఒక్క ఛార్జ్‌తో దాదాపు 660 కిమీ వరకు ప్రయాణం చేయవవచ్చునని కంపెనీ ప్రకటించింది. ఈ కారులో 90క్వ్హ్ బ్యాటరీని అమర్చారు. డీసీ చార్జింగ్ కెపాసిటీలో భాగంగా 170క్వ్ బ్యాటరీని కూడా ఏర్పాటుచేసింది. దానితో పాటు 430 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా ఏర్పాటు చేసింది. మార్కెట్‌లోకి రెండు వేరియంట్ల రూపంలో ఈ కారు రిలీజ్ అవనుందని కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2022 సంవత్సరంలో ఈ కారు కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఒక్క ఛార్జ్‌తో సుమారు 660 కిమీ ప్రయాణించవచ్చునని కంపెనీ వెల్లడించింది.
ఈ కారులో 90kWh బ్యాటరీ అమర్చారు. డీసీ చార్జింగ్ కెపాసిటీలో భాగంగా 170kW బ్యాటరీని ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 430 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించనుంది. మార్కెట్‌లోకి రెండు వేరియంట్ల రూపంలో ఈ కారు రిలీజ్ కానుందని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఓలా, ఇతర ద్విచక్ర వాహనాల కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.