Agneepath: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీం దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు ఈ అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర భారతంలో మొదలైన ఈ నిరసనలు, దక్షిణ భారతానికి పాకాయి. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లను అడ్డుకోవటానికి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన ఆర్మీ అభ్యర్థి రాజేష్ మృత్యువాత పడ్డాడు. శనివారం ఉదయం వరంగల్‌లో రాజేష్ అంతిమయాత్ర జరిగింది. అంతిమయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొంతమంది ఆందోళనకారులు బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుపై దాడి చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసును ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
కాగా, ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ బయట కాసేపు ఆందోళన చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసి, రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. రైల్వే స్టేషన్ లోపల పట్టాలపై బైఠాయించారు. ఆ తర్వాత ఫ్లాట్‌ఫామ్ మీద ఉన్న రైళ్లపై రాళ్ల దాడి చేశారు. అనంతరం అక్కడ ఉన్న రైళ్లు, స్టాళ్లను తగలబెట్టారు. దీంతో రైల్వే స్టేషన్ లోపల తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అదనపు బలగాలు వచ్చినప్పటికి ఆర్మీ అభ్యర్థులు తమ ఆందోళనను విమరించలేదు. పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఆందోళన సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. మరి, వరంగల్ రాజేష్ అంతిమ యాత్రలో ఉద్రిక్తతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక సంచలన విషయాలు!