ఈ మద్య చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మాద్యమాల ద్వారా తకు సంబంధించిన మధు జ్ఞాపకాలకు సంబంధించిన రేర్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు సంబంధించిన ఫోటోలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొంతమంది సెలబ్రెటీలు తమకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, యుక్త వయసు, పెళ్లి నాటి ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేయడం చూస్తున్నాం. ఫోటోలు అనేవి గడిచిన జీవితాలకు సంబందించిన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాయి. తాజాగా ఓ మహిళ చేతిలో గన్ పట్టుకొని నిల్చున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు.. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందన్న విషయాల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
జీవితంలో ఎన్నో కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరిన వారు ఉంటారు. అలాంటి వారిలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఒకరు. ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. పీడిత వర్గాల కోసం గన్ పట్టిన తెలంగాణ బెబ్బిలి సీతక్క. అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం జననాట్య మండలి ద్వారా గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసారు. 10 వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆర్థిక దోపిడీ కులవాద వివక్షతో హింసింపబడుతున్న ఆదివాసులు తరుపు నుంచి పోరాటం మొదలు పెట్టారు సీతక్క. చిన్న వయసులోనే పోరుబాట పట్టిన వీరవనిత సీతక్క. 1988 లో నక్సల్ పార్టీలో విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు సీతక్క. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు ప్రజా జీవనంలోకి వచ్చిన ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే ఆమె టీడీపీలో చేరారు. 2004లో తొలిసారి టీడీపీ నుంచి పోటి చేసి ఓడిపోయినా.. 2009 టీడీపీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 లో కాంగ్రెస్ తరుపు నుంచి ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా నియమించబడ్డారు. మొదటి నుంచి ప్రజా పక్షాన నిలబడే సీతక్క అధికార పార్టీ తప్పిదాలను ఏకిపడేస్తుంటారు. అందుకే తెలంగానలో ఆమెను ఫైర్ బ్రాండ్ అంటారు. కరోనా సమయంలో అడవి బిడ్డలకు ఆమె ఎంతో అండగా నిలిచారు. అటవీ ప్రాంతంలో కాలినడకన గిరిజనులకు బట్టలు, నిత్యావసర సరుకులు స్వయంగా అందించారు. తాజాగా సీతక్క యుక్త వయసులో నక్సల్ గా పోరాటం చేస్తున్న సమయంలో దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.