అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే జులై 15 నుండి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల పాటు అన్ని జిల్లాల్లోనూ వానలు పడుతూనే ఉన్నాయి. గ్రామాలు నీట మునిగాయి.
అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే జులై 15 నుండి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల పాటు అన్ని జిల్లాల్లోనూ వానలు పడుతూనే ఉన్నాయి. గ్రామాలు నీట మునిగాయి. పలువురు వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖతో పాటు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించగా.. శుక్రవారం కూడా సెలవు పొడిగిస్తున్నట్లు తెలిపింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు వరద నీటితో నిండిపోతున్నాయి. రోడ్లు సైతం చెరువులను తలపిస్తున్నాయి.
భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అవుతుంది. భూపాల పల్లి జిల్లాలోని మొరంచపల్లి నీట మునిగింది. వరదలో చిక్కుకున్న గ్రామస్థులను రక్షించేందుకు సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లే కాదు రైల్వే ఫ్లాట్ ఫామ్ కూడా నీట మునిగింది. కుండపోతగా వానలు కురవడంతో వరంగల్ రైల్వే స్టేషన్‌తో పాటు ట్రాకులపై వరద నీరు నిలిచిపోయింది. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు చేరింది. భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి గుడిలోకి వరద నీరు భారీగా చేరింది. నగరంలోని సుమారు 30 కాలనీలు నీట మునిగాయి.
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారితో పాటు,హన్మకొండ-వరంగల్ జాతీయ రహదారి వంతెనపై వరద నీరు పొంగిపొర్లుతోంది. పలు చోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. హన్మకొండలో కరెంట్ షాకుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కాడారి గూడె చెరువు, పంథని వద్ద ఊర చెరువు ఉప్పొంగి.. రహదారులపై ప్రవహిస్తున్నాయి. వర్షానికి పంటలు నీట మునిగాయి. మరికొన్ని రోజుల పాటు వానలు పడే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.