పలు దేశాల్లో పలు విధాలైన చట్టాలు ఉంటాయి. కొన్ని కఠినంగా, కొన్ని భయానకంగా, కొన్ని వివాదాస్పదంగా ఉంటాయి. అయితే మరికొన్ని వింత చట్టాలు నవ్వును తెప్పిస్తాయ. అలాంటి చట్టమే ఓ ద్వీప దేశంలో ఉంది.
ప్రపంచంలో అధికారికంగా గుర్తించబడిన దేశాలు 195. దేశానికో రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో పలు చట్టాలు. అయితే కొన్ని చట్టాలు కఠినంగా ఉంటే మరికొన్ని వివాస్పదంగా మారతాయి. కొన్ని కారణాలతో ఆ చట్టాలకు సవరణలు చేస్తూ ఉంటారు. వీటికి భిన్నంగా కొన్ని వింత చట్టాలు ఉంటాయి. వీటి గురించి వింటున్నప్పుడు హాస్యాస్పదంగా అనిపించక మానదు. అటువంటి చట్టమే ఓ దేశం చేసి వార్తల్లో నిలిచింది. ఆ చట్టంతో అక్కడి భర్తలు వణికి పోతున్నారు. భర్తల్నే భయపడుతున్న ఆ వింతైనా చట్టం.. ఏ దేశం, ఎప్పుడు చేసిందో తెలుసుకోవాలనుకుంటే మీరూ చదివేయండి.
పెళ్లి చేసుకున్నాక భర్త నుండి భార్యలు కాస్తంత ప్రేమను ఎక్స్ పర్ట్ చేస్తారు. వారి పుట్టిన రోజో, తమ పెళ్లి రోజో భర్త విషెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విషెస్ రాలేదా ఆ ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. పెళ్లైన తొలినాళ్లలో భార్యపై కురిపించే ప్రేమ.. పిల్లలు పుట్టాక.. బాధ్యతలు దృష్ట్యా భర్తలకు తగ్గిపోతుంది. పిల్లలవే కాదూ, భార్య పుట్టిన రోజు, చివరకు తన పుట్టిన రోజు, పెళ్లి రోజులను కూడా మర్చిపోతుంటారు. ఇక ఆ పప్పులేమీ ఉడకవు అంటోందీ ఈ దేశం. మీరేదైనా మర్చిపోండీ కానీ భార్య పుట్టిన రోజు మర్చిపోకూదని వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. అలా చేస్తే ఏకంగా కారాగార వాసం తప్పక మానదు అని చెబుతోంది. ఆ దేశమే సమోవా.
అందమైన ఈ ద్వీప దేశంలోనే ఓ చట్టం రూపుదిద్దుకుంది. భార్య పుట్టిన రోజును మర్చిపోతే జైలుకు వెళ్లాల్సిందే. భార్య పుట్టిన రోజు మొదటి సారి మర్చిపోతే అతన్ని హెచ్చరిస్తారట. ఇదే తప్పును రెండోసారి పునరావృతం చేస్తే నేరం కిందకు పరిగణిస్తారు. అనంతరం జైలుకు వెళ్లక తప్పదు. ఆరు నెలలో, ఏడాదో కాదూ .. ఏకంగా ఐదేళ్లు ఊచలు లెక్కపెట్టవలసిందే. ఈ చట్టాన్ని ఆ దేశం ఖచ్చితంగా పాటిస్తుందట. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇటువంటి ఫిర్యాదులు రాగానే ఈ బృందం రంగంలోకి దిగి వెంటనే చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా భార్యలకు వారికుండే హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిబిరాలు కూడా ఉన్నాయి. ఇవి భారత్ లాంటి దేశాలకు తీసుకు వస్తే పరిస్థితి ఏంటంటారు..?దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.