బిగ్ బాస్ స్పెషల్- ఉమా దేవి.. బిగ్ బాస్ రియాల్టీ షో రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు ఈపేరు బాగా పరిచయం. అంతకు ముందు కార్తిక దీపం సిరియల్ లో భాగ్యగా ఉమ బాగా ఫేమస్. ఈ సీరియల్ లో ఉమాదేవి క్యారెక్టర్ తో చాలా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాక, తనదైన స్టైల్లో ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది ఉమాదేవి.
బిగ్ బాస్ షోలో కేవలం రెండు వారాలే ఉన్నా, హౌస్ లో ఉమాదేవి కంటెస్టెంట్స్ అందరిని గడగడా వణికించింది. నామినేషన్స్ వస్తే చాలు ఎందుకో మరి ఉమా పూనకం వచ్చినట్లు చలరేగిపోయింది. సందర్బం ఏదైనా సరే మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బిహేవ్ చేసింది ఉమా. బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్లు అందరితో ఏదో సంద్బంలో పేచీ పెట్టుకుని మొత్తానికి గయ్యాళి గంపగా పేరు తెచ్చుకుంది ఉమా దేవి.
కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఉమాదేవి ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా బిగ్ బాస్ ద్వార వచ్చే తన రెమ్యునరేషన్‌ను ఓమంచి పని కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తనకు వచ్చిన పారితోషికంలోని కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ఉమాదేవి నిర్ణయం తీసుకుంది.
ఉమాదేవి చేస్తున్న ఈ మంచి పని గురించి తెలిసిన నెటిజన్లు ఆమె పెద్దు మనసును మెచ్చుకుంటున్నారు. ఆమె నోరే పెద్దదని భావించిన అభిమానులు, ఇప్పుడు ఆమె మనసు కూడా పెద్దదే అంటూ ప్రశంసిస్తున్నారు. ఓ చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవికి అంతా మంచి జరగాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. ఐతే ఉమాదేవి హౌజ్ నుంచి వెళ్లిపోయాక షోలో మజా లేకుండా పోయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మళ్లీ ఉమాదేవి హౌజ్ లోకి రీఎంట్రీ ఇస్తే బావుంటుదని అనుకుంటున్నారు.