ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసులో 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం నిర్దోషిగా బటయపడ్డాడు సత్యం బాబు. అయితే తన జీవితంలో విలువైన సమయాన్ని చేయని నేరానికి జైళ్లో గడిపానని, తనకు ఉద్యోగం ఇచ్చేవారు ఎవరూ లేరని గతంలోనూ చెప్పాడు. ఏళ్లు గడుస్తున్నా ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహకారం అందకపోవడంతో సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును సత్యం బాబు కలిశాడు. చేయని నేరానికి 9 ఏళ్లు జైలులో గడిపిన తనకు ఇప్పటివరకూ న్యాయం మాత్రం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు చాలా కాలంపాటు జైలు జీవితాన్ని గడపగా.. హైకోర్టు సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2017లో తన పరిస్థితిని వివరించి తనకు 2 ఎకరాల సాగు భూమి, రూ. 10 లక్షల పరిహారం, ఇల్లు ఇవ్వాలని అప్పట్లో కలెక్టర్‌ను కోరాడు. నందిగామ ఎమ్మార్వో ఆఫీసుకు సైతం సత్యంబాబుకు సహాయం అందించాలని కలెక్టర్ సూచించారు.
ఇక ఇన్నేళ్లు గడిచినా న్యాయం జరగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. చేయని నేరానికి జైలులో గడిపిన తనకు కింది కోర్టు విధించిన జీవితఖైదు, జరిమానాలను హైకోర్టు రద్దు చేసింది. ఖర్చుల కింద సత్యంబాబుకు రూ. లక్ష చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తనకు ఇంకా న్యాయం జరగలేదకని.. నిర్దోషిగా తాను కేసు నుంచి బయటపడ్డా ప్రయోజనం మాత్రం లేదన్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని వ్యవసాయం కోసం 2 ఎకరాలు, సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు, ఇల్లు ఇప్పించి సహాయం చేయాలని కోరగా 2017లో కలెక్టర్ ఓకే చెప్పారు. కానీ నాలుగేళ్లు గడిచిపోయినా తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని, సోమవారం కలెక్టర్ స్పందన కార్యక్రమంలో మరోసారి ఆయనను కలుసుకుని తన పరిస్థితిని వివరించాడు సత్యం బాబు. తాను కేసు నుంచి నిర్దోషిగా బయటపకు వచ్చి 5 సంవత్సరాలు కావొస్తున్నా.. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం మాత్రం అందలేదని వాపోయాడు. ఇప్పటికైనా ప్రభుత్వం తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ఇది కూడా చదవండి: Groom: వరుడు కావాలంటూ రోడ్డుకెక్కిన యువతి
సత్యంబాబు బాధలు వర్ణనాతీతం..సత్యంబాబు జైల్లో ఉండగానే అతడి తండ్రి మరణించారు. జైలు నుంచి విడుదలయ్యాక.. పెళ్లీడుకు వచ్చిన చెల్లెలు, వయసు మీద పడిన తల్లిని పోషించే ఆర్థిక సోమత లేక సాయం కోసం ఎదురు చూశాడు. చెల్లెలికి పెళ్లి చేసిన కొన్ని రోజులకే తల్లి మరియమ్మ మతిస్థిమితం కోల్పోవడంతో సమస్యలు రెట్టింపయ్యాయి. అయేషా మీరా హత్య కేసులో అరెస్టుకు ముందే మరదలితో సత్యంబాబు వివాహం జరిగింది. ఏదో కారణంతో వీరిద్దరూ విడిపోగా.. జైలు నుంచి విడుదలైన సత్యంబాబు మహబూబాబాద్‌కు చెందిన ఓ ఫాస్టర్ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అయితే విలువైన సమయం జైల్లో గడిపిన తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Parents: ఆస్తి ముద్దు.. అమ్మనాన్నలు వద్దు! బయటకి గెంటేసిన కుమారులు!
ఆయేషా మీరా కేసు ఏంటంటే..2007 డిసెంబర్ 27న బీ.ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరాను విజయవాడలోని హాస్టల్ లో దారుణ హత్యకు గురైంది. బాత్రూంలోని రక్తంం మడుగులో ఆయేషా మీరా అనుమానాస్పదస్థితిలో మరణించింది.తన ప్రేమను తిరస్కరించడంతోనే హత్య చేసినట్టుగా ఓ లేఖ కూడా లభ్యమైంది. అత్యాచారం చేసి ఆయేషా మీరాను హత్య చేశారు. ఈ కేసులో కృష్ణ జిల్లా, జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యం బాబుని నిందితుడిగా గుర్తించి 2008 ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు నేరస్థులను రక్షించే ఉద్దేశ్యంలో భాగంగా సత్యం బాబును అరెస్ట్ చేశారంటూ అతడి బంధువులు, మానవహక్కుల కార్యకర్తలు ఆరోపించారు. జైలులో ఉన్న సమయంలో సత్యం బాబుకు అనారోగ్యం కారణంగా పక్షవాతం వచ్చింది. మరోవైపు సత్యం బాబు జైలు నుంచి తప్పించుకున్నాడని, అతడిని మళ్లీ అరెస్టు చేసినట్టుగా కూడా పోలీసులు అప్పట్లో తెలిపారు.
ఇది కూడా చదవండి: DJ టిల్లు పాటకి MLA జగ్గారెడ్డి మాస్ స్టెప్పులు..! వీడియో వైరల్
ఆయేషా మీరా కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబుకు యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై బాధితుడు హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ కేసును విచారించిన హైకోర్టు సత్యం బాబును నిర్ధోషిగా ప్రకటించింది.అంతేకాకుండా దర్యాప్తు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బాధితుడికి పరిహారంగా రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక నిర్దోషిగా విడుదలైన తనకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరుతున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.