సాధారణంగా సినీ ఇండస్ట్రీ అంటే హీరోయిన్లు ఎల్లప్పుడూ కెమెరా ముందు కనబడుతూ.. వరుస సినిమాలతో వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రమే గ్లామర్ షోకి దూరంగా ఉంటున్నారు. అలాగే సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ కోవకే చెందుతుంది నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీ పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎందుకంటే డెబ్యూ మూవీతోనే అందరినీ ఫిదా చేసింది. ఆ తర్వాత తెలుగులో మీడియమ్ హీరోలందరి సరసన నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సాయిపల్లవి ఫ్యాన్ బేస్ చూస్తే స్టార్ హీరోలకు సమానంగా మెయింటైన్ చేస్తోంది. అయితే.. సాయిపల్లవి సినిమా వస్తుందంటే చాలు.. సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా, ఫ్యాన్స్ అంతా థియేటర్స్ కి వెళ్ళేది ఆమెకోసమే.
ఇటీవలే సాయిపల్లవి.. నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో రానాతో నటించిన ‘విరాటపర్వం‘ మాత్రమే ఉంది. అదికూడా రెండేళ్లుగా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోవైపు విరాటపర్వం నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే ఓటిటి రిలీజ్ కానుందని సినీవర్గాలలో టాక్ వినిపిస్తుంది. కానీ ఇంతవరకు ఆ సినిమా రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు.
ప్రస్తుతం తెలుగుకు సంబంధించి సాయిపల్లవి కొత్త సినిమాలేవి సైన్ చేయలేదు. ఇంత క్రేజ్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సాయిపల్లవి.. ఏ సినిమా సైన్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు దూరంగా ఉంటుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరిగా సాయిపల్లవి ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా కనిపించింది. ఆ తర్వాత తన తదుపరి సినిమాల పై ఏ అప్ డేట్ ఇవ్వలేదు. మరి కావాలని సాయిపల్లవి గ్యాప్ తీసుకుందా.. అంటున్నారు నెటిజన్లు. కానీ ఫ్యాన్స్ మాత్రం సాయిపల్లవి కొత్త సినిమా అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ బ్యూటీ త్వరలోనే తీపికబురు వినిపిస్తుందేమో చూడాలి. మరి సాయిపల్లవి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.